ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాలిబన్ల ఆక్రమణలతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు. భయపడినట్టుగానే జరుగుతున్నది. శాంతి మంత్రం జపిస్తూనే కాల్పులకు తెగబడుతున్నారు. మహిళలపై విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా తప్పించుకొని దేశం దాటిపోవాలని చూస్తున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు కాబూల్‌లో మరో సంఘటన జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు. విమానం హైజాక్ అయినట్టు […]
సముద్రంలో వింత వింత జీవులు ఎన్నో ఉంటాయి. మహాసముద్రాల్లో మనకు కనిపించే జీవుల కంటే కనిపించని జీవులు కోట్ల సంఖ్యలో ఉంటాయి. అవి అప్పుడప్పుడు అరుదుగా బయటకు వచ్చి షాక్ ఇస్తుంటాయి. ఇక డాల్ఫిన్లు మనుషులతో ఎంత మమేకం అవుతాయో చెప్పక్కర్లేదు. డాల్ఫిన్లలో తెలుపు, గ్రే కలర్ డాల్ఫిన్లు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఇప్పుడు అత్యంత అరుదైన పింక్ డాల్పిన్‌లు సముద్రంలో కనిపించాయి. వాటిని చూసి అంతా షాకవుతున్నారు. ఇది నిజమా కాదా అని సందేహిస్తున్నారు. […]
సకాలంలో వర్షాలు కురవకపోవడం వలన పంటను పండించలేరు. అదే విధంగా భారీ వర్షాలు వరదల కారణంగా కూడా పంటకు నష్టం వస్తుంది. ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంది. ఈ పరిహారం కోసం రైతులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరగాలి. డబ్బులు చెల్లించాలి. వచ్చిన మొత్తంలో కొంత సమర్పిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. అయితే, హర్యానాలో ఓ రైతుకు వింత సమస్య వచ్చిపడింది. తనకు 20 ఎకరాల పంటపోలం ఉన్నది. […]
త్వరలోనే ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఎవర్ని ముంబై మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలి అనే విషయంపై పార్టీ ఓ డాక్యుమెంట్‌ను రూపోందించింది. ఇందులో వ్యాపారవేత్తలు, స్టార్టప్ సీఈవోలు, ప్రముఖ సినీ నటుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి విలాస్‌దావు దేశ్ ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్, ప్రముఖ సినినటుడు మోడల్ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేర్లను కూడా ఆ […]
తెలంగాణలో అక్టోబర్ నెలతో ఇప్పుడున్న 2,216 లిక్కర్ షాపుల లైసెన్సులు ముగియనున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన తరువాత మద్యం షాపుల వేలం ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరినాటికి కొత్త మద్యం పాలసీని అమలులోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇక ఈ వేలం లైసెన్స్ ఫీజులు పెంచాలని ప్రభుత్వం చూస్తున్నది. దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 2,216 లిక్కర్ షాపులతో పాటుగా […]
రాత్రి సమయంలో ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించేందుకు వందల సంఖ్యలో నగరవాసులు అక్కడికి వస్తుంటారు. ఒకవైపు పర్యాటకులతో పాటు, ట్రాఫిక్ రద్ధీకూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ రద్ధీ అధికం. దీంతో ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరవాసుల ట్యాంక్‌బండ్ సందర్శనకు […]
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 25,467 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు 3,24,74,773కేసులు నమోదవ్వగా, ఇందులో 3,17,20,112 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,19,551 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 354 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,35,110 కి చేరింది. […]
దేశంలో ఎన్నో మూఢాచారాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక గ్రామాల్లో పంచాయతీల్లో ఇచ్చే తీర్పులకు కట్టుబడి ఉంటుంటారు. ఎంతటి కఠిన శిక్షలు విధించినా మౌనంగా భరిస్తుంటారు. ఓ అత్త తక కోడలిపై బాబా దర్బార్‌కు ఫిర్యాదు చేసింది. బాబా దర్భార్ తనదైన శైలిలో కోడలకు వింత శిక్షను అమలు చేశారు. అందరిముందు కోడలు నిప్పుల్లో నడిచి నిరూపించుకోవాలని అన్నారు. చెప్పినట్టుగానే కోడలు నిప్పుల్లో నడిచింది. అయితే, ఈ తతంగాన్ని కొంతమంది సోషల్ మీడియాలో […]
ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయినప్పటికీ ఉత్తర భాగంలో ఉన్న పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం తాలిబన్లు పోరాటం చేస్తున్నారు. నిన్నటి రోజున జరిగిన పోరాటంలో 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ ఫైటర్స్ పేర్కొన్నారు. పంజ్‌షీర్ ఫైటర్స్‌కు మాజీ ముజాహిదీన్ నేత అహ్మద్ షా కుమారుడితో పాటు, ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నాయత్వం వహిస్తున్నారు. ఆఫ్ఘన్ రద్దుచేసిన సాయుధ సిబ్బందితో పాటుగా, స్థానికి మిలీషియా దళంతో కలిసి తాలిబన్లపై […]