ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యాయి. వారం రోజుల నుంచి చిన్నారులు స్కూళ్లకు వెళ్తున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడంతో అందులో చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. నాడునేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లకు అధునాతనమైన సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం. ఇక ఇదిలా ఉంటే, ఏపీలో కరోనా కేసులు ప్రతిరోజూ వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. స్కూళ్లలోనూ కేసులు నమోదవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న డీఆర్ఎం మున్సిపల్ స్కూళ్లో ప్రధానోపాధ్యాయుడు, ముగ్గురు ఉపాద్యాయులు, ముగ్గురు విద్యార్ధులు కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా, మరికొందరు ఉపాద్యాయులు, విద్యార్ధుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలోని ఎంపీసీ కండ్రిగలోని పాఠశాలలో ఐదుగురు విద్యార్ధులు కరోనా బారిన పడ్డారు.స్కూళ్లు తెరిచిన వారం రోజుల వ్యవధిలో వివిధ స్కూళ్లలో పిల్లలు, ఉపాద్యాయులు కరోనా బారిన పడుతుండటంతో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
Read: ఆ రికార్డులను అందుకే తగలబెట్టేస్తున్నారట…