ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాగైనా ప్రాణాలతో బయటపడితే చాలు అనుకొని చాలామంది ప్రజలు తాలిబన్ల కళ్లుగప్పి కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ దేశం నుంచి ప్రజల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. భారతీయులను వేగంగా అక్కడి నుంచి ఇండియాకు తరలిస్తున్నారు. వీరితో పాటుగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారిని కూడా ఇండియాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం భారత్ దేవీ శక్తి పేరుతో ఆపరేషన్‌ను చేపట్టింది. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో తొలి ముస్లిమేతర సిక్కు మహిళా […]
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేస్తు నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం ఇటీవల చట్టాల్లో మార్పులు చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విదేశీ పెట్టుబడులు 26శాతానికి పరిమితం చేయడంతో దానికి తగ్గట్టుగా తమ సర్వీసులకు నడపలేమని చెప్పి యాహు కంపెనీ యాహు న్యూస్, యాహు బిజినెస్, యాహు క్రికెట్ తదితర వెబ్ సర్వీసులకు ఇండియాలో నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, యాహులోని మెయిల్ ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని యాహు వెబ్ సర్వీస్‌ను నిర్వహిస్తున్న వేరిజాన్ […]
తాలిబన్లు రెండోసారి ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. 1994లో మొదటిసారి తాలిబన్లు ఆఫ్ఘన్ దురాక్రమణకు పూనుకోవడం, 1996లో అధికారంలోకి రావడంతో ఆక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే కాకుండా పాక్‌లోనూ తాలిబన్లు వారి ఉనికిని చాటుకున్నారు. 9 ఏళ్ల క్రితం తాలిబన్లు పాక్‌లోని క్వెట్టా ప్రాంతంలోకి ప్రవేశించి స్కూల్ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విద్యార్ధిని మలాలా యూసెఫ్‌జాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత ఆమెను పెషావర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి […]
దేశంలో మరోసారి కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 46 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా 11 వేలకు పైగా కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తం అయింది. నమోదైన 46,164 కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 31,445 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ కేరళలో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాజిటివ్ […]
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలన కొనసాగుతున్నది. అక్కడ పరిస్థితులు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణల సమయంలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని వదిలి యూఏఈ వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, కొన్ని నెలల క్రితం ఆఫ్ఘన్ ఐటీ మంత్రిగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ షా సాఅదత్ అప్పటి అధ్యక్షుడు ఘనీతో పొసగకపోవడంతో తన పదవికి రాజీనామా చేసి జర్మనీ వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో బతుకుజీవనం కోసం పిజ్టా డెలివరీ బాయ్‌గా […]
ఇంగ్లాండ్‌లోని వేల్స్ తీరంలోని బీచ్‌లో అమందా అనే మహిళ వాకింగ్ చేస్తుండగా ఆమెకు ఓ వైన్ బాటిల్ కనిపించింది. వెంటనే దానిని తీసుకొని ఇంటికి వెళ్లింది. సముద్రంలో కొట్టుకొని వచ్చింది అంటే అరుదైన వస్తువుగా భావించి భద్రంగా దాచుకుంది. కొన్ని రోజుల తరువాత ఆ వైన్ బాటిల్ కు సంబందించిన ఫొటోలను ఆమె తన కోడలకు పంపింది. వాటిని చూసిన ఆ కోడలు.. ఆ బాటిల్ లో ఏముందో చూడమని చెప్పగా, అమందా బాటిల్ మూత ఒపెన్ […]
సముద్రతీరంలో అలలు ఎలా విరుచుకుపడుతుంటాయో చెప్పక్కర్లేదు. మామూలు సమయాల్లో కూడా అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, విశాఖ జిల్లా భీమిలి, శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంతాల్లోని సముద్రపు అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. అయితే, మంగళవారం రోజున రాజోలు నుంచి సముద్రంలోని 156 కిమీ దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 5.1 గా నమోదైన సంగతి తెలిసిందే. ఈ భూకంపం తరువాత సముద్రంలో సడెన్‌గా మార్పులు కనిపించాయి. ఎప్పుడు అలలతో […]
ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరూ చెప్పలేరు. ఒక మనిషి మరో మనిషితో ప్రేమలో పడొచ్చు… ఒక మనిషి ఓ జంతువుతో ప్రేమలో పడొచ్చు… చెప్పలేం. మనిషికి చాలా దగ్గర పోలికలతో ఉండే చింపాజీలు త్వరగా మనుషులతో ప్రేమలో పడుతుంటాయి. బెల్జియంలోని బ్రసెల్స్‌లో యాంట్ వెర్ప్ అనే జూ ఉన్నది. అ జూకి టిమ్మర్‌మన్స్ అనే మహిళ తరచుగా వస్తుంటుంది. అలా జూకి వచ్చిన ఆ మహిళకు చిటా అనే చింపాజీ బాగా నచ్చింది. […]
ఆఫ్ఘనిస్తాన్లో అరాచక పాలన మొదలైంది. శాంతి మంత్రం జపిస్తూనే తాలిబన్లు తమ మార్క్ హింసను చూసిస్తున్నారు. దేశం విడిచిపారిపోవాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లేవారిపై దాడులు చేయడం, కాల్పులు జరపడం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు తాలిబన్లు. ఇక మహిళల విషయంలో తాలిబన్లు ఎంతటి కౄరంగా ప్రవర్తిస్తారో వేరే చెప్పక్కర్లేదు. మహిళలు ఒంటరిగా బయటకు వస్తే వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే గ్యారెంటీ […]
తాలిబన్ల శకం ఆరంభం అయినప్పటి నుంచి పంజ్‌షీర్ ప్రావిన్స్ వారికి కొరకరాని కొయ్యగా మారింది. 1994 ప్రాంతంలో కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నప్పటికీ పంజ్‌షీర్ మాత్రం వారికి దొరకలేదు. అప్పటి నుంచి అక్కడి స్థానిక సాయుధులు తాలిబన్లతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాగా, ఇప్పుడు కూడా తాలిబన్లతో పంజ్‌షీర్ సేనలు పోరాటం చేస్తున్నాయి. పంజ్‌షీర్ సేనలు 6 వేల వరకు ఉండగా, తాలిబన్ల సైన్యం అపారంగా ఉంది. పైగా వారివద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ […]