ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరూ చెప్పలేరు. ఒక మనిషి మరో మనిషితో ప్రేమలో పడొచ్చు… ఒక మనిషి ఓ జంతువుతో ప్రేమలో పడొచ్చు… చెప్పలేం. మనిషికి చాలా దగ్గర పోలికలతో ఉండే చింపాజీలు త్వరగా మనుషులతో ప్రేమలో పడుతుంటాయి. బెల్జియంలోని బ్రసెల్స్‌లో యాంట్ వెర్ప్ అనే జూ ఉన్నది. అ జూకి టిమ్మర్‌మన్స్ అనే మహిళ తరచుగా వస్తుంటుంది. అలా జూకి వచ్చిన ఆ మహిళకు చిటా అనే చింపాజీ బాగా నచ్చింది. ప్రతిరోజూ జూకి వచ్చి ఆ చిటా చింపాంజీని చూస్తుండేది. కొన్ని రోజులకు ఆ చింపాజీ కూడా టిమ్మర్‌మన్స్‌ను చూడడం మొదలుపెట్టింది. ఇలా ఇద్దరూ చూసుకొని చూసుకొని ప్రేమలో పడిపోయారు. కొన్ని రోజుల తరువాత చిటా ప్రవర్తనలో మార్పును జూ సిబ్బంది గమనించారు. టిమ్మర్‌మన్స్ జూలో లేని సమయంలో వేటికి దగ్గర కావడం లేదు. మూడీగా కూర్చుండిపోతున్నది. ఈ వింతప్రవర్తను చూసి షాకైన జూ సిబ్బంది టిమ్మర్‌మన్స్‌ను నిలదీశారు. అమె అసలు విషయం చెప్పింది. చిటా ప్రేమలో పడినట్టు ఆమె తెలియజేసింది. వెంటనే జూ సిబ్బంది టిమ్మర్‌మన్స్‌పై నిషేదం విధించారు. మనిషితో ప్రేమలో పడితే చింపాజీలు తోటి జంతువులతో ఉండలేవని, వాటిని దగ్గరికి కూడా రానివ్వవని జూసిబ్బంది చెబుతున్నారు. టిమ్మర్‌మన్స్ జూకి రాకుండా అమెపై నిషేదం విధించినట్టు తెలిపారు.
Read: తాలిబన్ల కీలక నిర్ణయం: ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దు…