ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలన కొనసాగుతున్నది. అక్కడ పరిస్థితులు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణల సమయంలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని వదిలి యూఏఈ వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, కొన్ని నెలల క్రితం ఆఫ్ఘన్ ఐటీ మంత్రిగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ షా సాఅదత్ అప్పటి అధ్యక్షుడు ఘనీతో పొసగకపోవడంతో తన పదవికి రాజీనామా చేసి జర్మనీ వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో బతుకుజీవనం కోసం పిజ్టా డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం సాఅదత్ లీప్‌జిగ్ సిటీలో ఓ పిజ్జా కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బతుకుతెరువు కోసం ఈ పని చేయడంలో ఎలాంటి తప్పులేదని అంటున్నాడు సాఅదత్. ఆఫ్ఘన్ మాజీ ఐటీ మంత్రికే ఇలా ఇబ్బందులు పడుతుంటే, తాలిబన్ల నుంచి తప్పించుకొని దేశం విడిచి వెళ్లిన సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో…
Read: సముద్రంలో 4800 కిమీ ప్రయాణం చేసిన వైన్ బాటిల్… అందులో ఏముందంటే…