కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్ ను కొనసాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స సంస్థ వ్యాక్సిన్ పై కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఇప్పటికే ఆ కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా అమలు చేసింది. అయితే, కొంతమంది […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ దేశంలో 60 లక్షల మందికి పైగా టీకాలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా 24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించింది. అంటే గంటకు లక్ష మందికి వ్యాక్సిన్ అందించింది. 24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి టీకాలు అందించి రికార్డ్ సృష్టించింది. గతంలో […]
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక స్కూళ్లు తిరిగి ప్రారంభించిన తరువాత ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ప్రతిరోజూ స్కూళ్లలో విద్యార్దులు, ఉపాద్యాయుడు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో ఏపీలో 1539 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,07,730కి చేరింది. ఇందులో 19,79,704 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా, […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతున్నది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వ్యాపార సంస్థలను తెరవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు వ్యాపారులు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. బడా వ్యాపారవేత్తలు అక్కడే ఉంటే ప్రాణాలతో ఉండలేమని చెప్పి ముందుగానే దేశం వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ఓ వ్యక్తి నిర్వహిస్తున్న వ్యాపారం దివ్యంగా సాగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అజీజ్ గ్రూప్‌కు మంచి […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వీలైతే ఎలాగైనా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఏదోక విమానం ఎక్కి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇక, ఆగస్టు 31 వరకు తాలిబన్లు ఎయిర్‌పోర్టులోని అమెరికా, నాటో దళాలకు డెడ్‌లైన్ విధించారు. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వారంతా వెళ్లిపోవాలని షరతు విధించారు. అందుకు తగ్గట్టుగానే అమెరికా, నాటో దళాలు ప్రజలను తరలిస్తున్నాయి. అయితే, వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్‌పోర్టుకు కొత్త వ్యక్తులు […]
ఇటీవల కాలంలో బుల్లెట్టు బండి పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు. ఓ నవ వధువు ఈ పాటకు చేసిన డ్యాన్స్‌తో పాట హైలైట్ అయింది. ఆ వీడియో ఫేమస్ కావడంతో ఆ పాటకు అనేక మంది డ్యాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఈ పాట మాములు జనాలకు మాత్రమే కాదు, అటు జంతువులకు కూడా విపరీతంగా నచ్చుతున్నది. ఎంతగా అంటే, ఆ పాట వింటేనే పాలు తాగేంతగా నచ్చుతుందట. మహబూబాబాద్ […]
ఇప్పటి వరకు మనం డ్రోన్ కెమెరా ద్వారా వీడియో షూటింగ్ చూసి ఉంటారు. పారాచూట్‌లో వెళ్తూ షూటింగ్ చేయడం చూసుంటారు. కాని, చిలుక ఎగురుతూ వీడియో తీయడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. చిలుక మాట్లాడుతుందని తెలుసుగాని, ఇలా వీడియోను షూట్‌చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓ వ్యక్తి తన మొబైల్‌ను చూసుకుంటుండగా చిలుక అమాంతంగా ఆ మొబైల్ ఫోన్‌ను ఎత్తుకు పోయింది. అయితే ముక్కుకు ఫోన్‌ను కరుచుకుపోవడంతో వీడియో మోడ్ ఆన్ అయింది. అంతే […]
అప్పుడప్పుడు మత్స్యాకారుల వలకు ఆరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన అరుదైన చేపలను అధికమొత్తానికి అమ్ముతుంటారు. అయితే, కొన్ని రకాల చేపలు మాత్రం భయపెడుతుంటాయి. అవి అరుదైన చేపలు మాత్రమే కాదు.. డేంజర్ కూడా. విదేశాల నుంచి దేశానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన అక్వేరియం చేప సక్కర్ క్యాట్‌ఫిష్ చేపలు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వ్యాపించాయి. వేగంగా ఈ చేపలు వాటి సంతతిని పెంచుకుంటాయి. అంతేకాదు, ఈ చేపల శరీరంపై నల్లని చారలు […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా సామాన్య ప్రజలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. కాల్పులు జరుపుతున్నారు. శాంతి మంత్రం వల్లెవేస్తూనే, అరాచకాలు సృష్టిస్తున్నారు. మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే విదేశీ మీడియా సంస్థలు, ప్రతినిధులు, జర్నలిస్టులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఉన్న మీడియా క్షణక్షణం భయం భయంగా వార్తలను అందిస్తోంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని చేస్తున్నప్పటికీ వారి అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా, స్థానిక […]