దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ తగ్గిపోతుందని అనుకున్నా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక కేరళలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు, 200 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఓనం ఫెస్టివల్ తరువాత ఈ పరిస్థితి నెలకొన్నది. గురువారం రోజున 30,007 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో పాజిటివిటి రేటు 18.03 శాతంగా ఉంది. కరోనా […]
కాబూల్ ఎయిర్‌పోర్ట్ వరస బాంబు పెలుళ్లతో దద్దరిల్లిపోతున్నది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్ వద్ద 6 పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 72 మంది మృతి చెందారు. ఇందులో సాధారణ పౌరులు 60 మంది ఉండగా, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 160 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. 160 మందిలో 145 మంది […]
ప్రపంచంలో ఇప్పటికే 700 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నది. ఎక్కువ జనాభా ఆసియా దేశాల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఉన్న జనాభాకు కావాల్సిన మౌళిక వసతులు, ఆహారం, ఉద్యోగాల కల్పన సరిగా అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లల్ని కనడంపై కంటే, కెరీర్‌పైనే ప్రజలు ఎక్కువగా దృష్టిసారించారు. దీంతో అనేక దేశాల్లో జననాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. కరోనా మహమ్మారి ప్రభావం కూడా జననాల సంఖ్యపై […]
ఇందిరాపార్క్ లో ఉదయం, సాయత్రం సమయాల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. అయితే, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సామాన్యప్రజలకు ప్రవేశం ఉంటుంది. ఇందిరా పార్క్‌కు ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా ఈ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుండటంతో పార్క్ యాజమాన్యం గేటు ముందు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఈ ఫ్లెక్సీపై […]
నిన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగి వస్తుండటంతో దేశీంగా ధరలు తగ్గుతున్నాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి 44,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేర తగ్గి రూ.48,220 కి చేరింది. […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత అక్కడ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలను గౌరవిస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలా జరగడంలేదు. మహిళలను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నారు. ఒంటరిగా బయటకు వస్తున్న మహిళలను తాలిబన్ ఫైటర్లు హింసిస్తున్నారు. దీనిపై తాలిబన్ నేతలు ఓ వింత ప్రకటన చేశారు. తమ ఫైటర్లకు ఇంకా మహిళలను గౌరవించడం తెలియడం లేదని, వారికి త్వరలోనే మహిళలను ఎలా గౌరవించాలో నేర్పుతామని, అప్పటి వరకు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇంటి నుంచి బయటకు రావొద్దని […]
అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అగ్రరాజ్యాల నిఘావ్యవస్థలు హెచ్చరించిన కొద్దిసేపటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందగా, 140 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇప్పటికే ఐసిస్ ప్రకటించింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారి ఫొటోలను కూడా ఐసిస్ రిలీజ్ చేసింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడులు జరిగిన కాసేపటి తరువాత సెంట్రల్ కాబూల్‌లో మరోపేలుడు సంభవించినట్టు సమాచారం. […]
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తరువాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వెళ్లాలని తాలిబన్లు ఇప్పటికే అమెరికా దళాలను ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే, నిన్నటి రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, కాబూల్ ఎయిర్‌పోర్టు వైపు ఎవరూ రావొద్దని అగ్రదేశాల నిఘా సంస్థలు హెచ్చరించారు. ఈహెచ్చరికలు జరిగిన గంటల వ్యవధిలోనే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద రెండు బాంబుదాడులు జరిగాయి. ఈ దాడిలో 72 మంది మృతి చెందగా, 140 […]
మేషం : ఉపాధ్యాయ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. షాపింగులో నాణ్యతలు గమనించాలి. పెట్టుబడులకు తగిన సమయం కాదు. స్త్రీ ఆరోగ్యం విషయంలో కొంత మెళకువ వహించండి. దైవ దర్శనం చేయు సూచనలు కలవు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆహార విషయాలపై దృష్టిసారించడం అవసరం. వృషభం : గృహ నిర్మాణం, ఫర్నిచర్, కొనుగోలుకు నిధులు సమకూర్చుకొనుటలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది., బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు […]
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు అక్రమించుకొని పదిరోజులైంది. అధికార బదలాంపు ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ముల్లా బరాదర్ ను నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన పేరు ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీలకమైన రక్షణ, ఆర్ధిక శాఖలను తాలిబన్లకు నమ్మకమైన వ్యక్తులకు అప్పటించబోతున్నారని సమాచారం. గతంలో అమెరికాలోని గ్వాంటెనామో బే జైల్లో ఖైదీగా శిక్షను అనుభవించిన ముల్లా అబ్దుల్ ఖయ్యుం జకీర్‌కు అప్పగించబోతున్నారని సమాచారం. 2001లో అమెరికా దళాలు తాలిబన్లపై దాడి […]