ఏ పని పూర్తి చేయడానికైనా పక్కాగా స్కెచ్ ఉండాలి. దానికి తగిన పట్టుదల, ఓర్పు, సహనం ఉండాలి. అంతకు మించి వారితో కలిసి పనిచేసే వ్యక్తులు ఉండాలి. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఎలాంటి కష్టమైన పనినైనా పూర్తిచేయవచ్చు అని నిరూపించారు ఇజ్రాయిల్‌కు చెందిన ఖైదీలు. ఇజ్రాయిల్‌లోని గిల్బోవా అనే జైలు ఉన్నది. అందులో కరడుగట్టిన నేరస్తులను ఉంచుతారు. నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఆరుగురు ఖైదీలో అధికారుల కళ్లుగప్పి తప్పించుకుపోయారు. వారు తప్పించుకోవడానికి ఉపయోగించిన ఆయుధం […]
మామూలుగా అయితే బెండకాయలు కిలో రూ.30 లేదా రూ.40 వరకు ఉంటాయి. కానీ, ఆ బెండకాయలు మాత్రం మటన్ ధర పలుకుతున్నాయి. అందులో స్పెషల్ ఏముంది అంటే అంతా స్పెషలే అంటున్నారు. ఎందుకంటే, ఈ బెండకాయలు ఆకుపచ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణ బెండకాయలతో పోల్చితే ఇందులో ఉండే పోషకాలు అమోఘం. గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది. 40 రోజుల్లోనే ఈ పంట చేతికి వచ్చినట్టు మధ్యప్రదేశ్ కు చెందిన రైతు […]
1912 వ సంవత్సరంలో టైటానిక్ షిప్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో టైటానిక్ ఒక లగ్జరీ షిప్‌గా పేరుగాంచింది. ఈ షిప్ సముద్రంలోని ఐస్‌బర్గ్‌ను ఢీకొని మునిగిపోయింది. అందులో ప్రయాణం చేస్తున్న వందలాది మంది జలసమాధి అయ్యారు. ఎన్నో ఏళ్ల తరువాత ఆ షిప్‌ను పరిశోధకులు సముద్రంలో గుర్తించారు. ఆ షిప్ ఆధారం చేసుకొని టైటానిక్ సినిమా వచ్చింది. టైటానిక్ షిప్ మునిగిపోయి వందేళ్లకుపైగా అయింది. సముద్రం అడుగున ఉన్న ఆ షిప్ […]
హాలీవుడ్ లో యాంట్స్ అనే సినిమా వచ్చింది గుర్తుంది కదా. ఆ సినిమాలో విమానం ప్రయాణం చేస్తుండగా భయానకమైన చీమలు దాడులు చేస్తాయి. విమానం లోపల జరిగే ఆ సీన్స్ నిజంగా తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి సంఘటనే న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఢిల్లీ నుంచి ఏఐ111 విమానం లండన్‌కు వెళ్లాల్సి ఉన్నది. మొత్తం 248 ప్రయాణికులతో టెకాఫ్ కావడానికి సిద్దంగా ఉన్నది. అందులో భూటాన్ యువరాజు కుడా ఉన్నారు. ఉన్నట్టుండి బిజినెస్ క్లాస్‌లోనుంచి ప్రయాణికులు పెద్ద […]
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సంస్థలు ఎన్నికలకు సంబందించి ముందస్తు సర్వేలు ఫలితాలు విడుదల చేశాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని, మళ్లీ సీఎంగా యోగీని ఎంచుకునే అవకాశం ఉందని ముందస్తు సర్వేలు పేర్కొన్నాయి. ఇక ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో యూపీనుంచి ఎంఐఎం కూడా బరిలోకి దిగుతున్నది. చారిత్రక నగరమైన అయోధ్య నుంచి ఎంఐఎం ఎన్నికల […]
గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం వ్యవసాయానికి మంచిదే. అయితే, పట్టణ, నగర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణ, నగరాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సిరిసిల్ల పట్టణంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సిరిసిల్లలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లొతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి పండుగ కోసం ఏర్పాటు చేసిన వినాయకుని […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 31,222 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,58,843కి చేరింది. ఇందులో 3,22,24,937 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 3,92,864 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో మహమ్మారి నుంచి 42,942 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 290 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు […]
ప్రపంచంలో డెల్టా వేరియంట్ కొన్ని దేశాల్లో విజృంభిస్తున్నది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అమెరికాలో కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశంనుంచి వచ్చే వారిపై కొన్ని దేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఆసియాలోని గల్ఫ్ దేశాల్లో కరోనా కాస్త శాంతించింది. గల్ఫ్ లోని కొన్ని దేశాల్లో కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. […]
21 వ శతాబ్దంలో కూడా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. అంతరిక్షంలోకి ప్రయాణాలు చేస్తున్న కాలంలో వర్షాల కోసం అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వర్షం కోసం వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామంలోని ఆరుగురు బాలికలను నగ్నంగా మార్చి గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లా బనియా గ్రామంలో జరిగింది. గ్రామంలో ఆరుగురు బాలికను నగ్నంగా మార్చి కప్పలను కర్రలకు కట్టి వాటిని వారి భుజాలపై ఉంచి వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబందించిన వీడియోలు బయలకు […]