జమ్మూకాశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తాలిబన్ల నుంచి ఇతర దేశాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. తాలిబన్లను ఎదుర్కొనడానికి అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ తాలిబన్లు జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రచర్యలకు తెగబడితే దానిని ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా తరిమికొట్టాని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి వంటి అంశాలపై సైనికులకు శిక్షణ ఇవ్వనున్నారు. పోరాట వ్యూహాలపై బోర్డర్‌లోని చివరి సైనికుడి వరకు శిక్షణ ఇస్తామని సైనికాధికారులు చెబుతున్నారు. ఇతర దేశాల విషయంలో జోక్యం చేసుకోబోమని చెబుతున్నప్పటికీ వారి మాటలను ఎవరూ నమ్మేపరిస్థితుల్లో లేరు.
Read: నిమర్జనం రివ్యూ పిటిషన్‌పై నేడు కీలక విచారణ… అనుమతులు ఇస్తారా…