హుస్సేన్ సాగర్‌లో గణపతి విగ్రహాలను నిమర్జనం చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మట్టి గణపయ్యలు మినహా పీవోపీ విగ్రహాలను నిమర్జనానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో నిన్నటి రోజున లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈరోజు ఆ పిటిషన్‌ను విచారించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు పిటిషన్‌ను విచారించబోతున్నారు. రివ్యూపిటిషన్‌లో 4 అంశాలకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని.. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని.. సాగర్‌లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని.. హుస్సేన్ సాగర్‌లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని రివ్యూ పిటిషన్‌లో ప్రభుత్వం కోరింది. నిమర్జనం ఆలస్యమైతే హైదరాబాద్ నగరం స్థంబించిపోతుందని, విగ్రహాలను నిమర్జనం చేయడం కష్టం అవుతుందని, హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం పూరైన 48 గంటల్లో శుభ్రం చేస్తామని ప్రభుత్వం తన రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నది. రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read: తాలిబన్ల ఆధీనంలో దోస్తమ్ నివాసం…ఇంటిని చూసి షాకైన తాలిబన్లు…