రేపు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం జరగబోతున్నది. ఈ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గణపయ్యలను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. శనివారం అర్థరాత్రి నుంచి నగరంలో అంతర్రాష్ట్ర, జిల్లాల నుంచి వచ్చే లారీలపై నిషేదం అమలుచేశారు. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సులను రూట్‌లను మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్ […]
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మరోషాక్ తగిలింది. ఆపార్టీ అసన్‌సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఆయన తృణమూల్ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల తరువాత బాబూలాల్ సుప్రియో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలే జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. అయితే, ఈనెలలో బెంగాల్‌లో మూడు అసెంబ్లీ […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం ఇప్పటి వరకు గుర్తించలేదు. చాలా దేశాలు ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అందించే నిధులు చాలా వరకు ఆగిపోయాయి. తాజాగా ఆ దేశంతో అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ సంబంధాలను తాత్కాలికంగా తెంచుకుంది. అంతర్జాతీయ సమాజం గుర్తింపు లేకపోవడంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి నిధులు అందించలేమని ఐఎంఎఫ్ సంస్థ తెలియజేసింది. దీంతో ఆఫ్ఘన్ దేశానికి […]
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేయడంతో ట్యాంక్ బండ్ వద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబందించిన ఏర్పాట్లును నిర్వహకులు వేగంగా చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు రాత్రి 9 గంటల తరువాత ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అనుమతిని రద్దు చేశారు. రేపు తెల్లవారుజామున 3 […]
దక్షిణాసియాలో చైనా రోజురోజుకు తన దూకుడును పెంచుతున్నది. సైనిక బలగాన్ని పెంచుకుంటూ దక్షిణ సముద్రంతో పాటుగా ఇతర దేశాలపై కూడా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే పాక్, శ్రీలంకతో పాటుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైకూడా చైనా కన్నుపడింది. అటు హాంకాంగ్, వియాత్నం కూడా తమవే అని చెప్తున్నది. రోజు రోజుకు చైనా తన బలాన్ని పెంచుకుంటుండటంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆసియాలోని ఇండియా, జపాన్, అస్ట్రేలియాతో కలిసి ఇప్పటికే క్వాడ్ కూటమిని ఏర్పాటు […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రపంచంలో అనేక రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి తయారినీ బట్టి కరోనా వైరస్ ను అడ్డుకునే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్లు మూడు నెలల పాటు కరోనా మహమ్మారికి అడ్డుకోగలిగితే మరికొన్ని ఆరు నెలల వరకు వైరస్‌ను అడ్డుకోగలుగుతాయి. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆరు నెలల వరకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, బలమైన […]
గుజరాత్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం భూపేంద్ర పాటిల్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. కాగా రేపు భూపేంద్ర క్యాబినెట్ ప్రమాణ ప్రమాణస్వీకారం ఉండబోతున్నది. కాగా, ఈరోజు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపారు. స్పీకర్ రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్టు సెక్రటరి ప్రకటించారు. కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్నది […]
అంతరిక్షయానంలో ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షయానంలో ముందడుగు వేశాయి. కాగా, ఇప్పుడు స్పేస్ ఎక్స్ సంస్థ మరో అడుగు ముందుకు వేసి భూకక్ష్యలోకి వ్యోమనౌకను పంపింది. ఈ వ్యోమనౌకలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. వీరు మూడు రోజుల పాటు ఈ వ్యోమనౌకలో భూమిచుట్టూ ప్రదక్షణ చేస్తారు. మూడు రోజుల తరువాత వీరు తిరిగి భూమిమీదకు రానున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్ఫిరేషన్ 4 పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. […]
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్యాంక్‌బండ్ లోని హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతులు మంజూరు చేసింది. […]
రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. వైరస్ వ్యాప్తి తరువాత ఇప్పుడు మరోసారి చైనాలో కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాని దక్షిణ ప్రావిన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. డెల్టావేరియంట్ కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుతియాన్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి. […]