ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్టు సచివాలయాల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎంపిక చేసిన 51 గ్రామ, వార్డు సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఏపీ సర్కార్ పేర్కొన్నది. పారదర్శకత కోసమే గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టబోతున్నట్టు సర్కార్ తెలియజేసింది. దీనికోసం గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
Read: గోవా ఎన్నికలపై టీఎంసీ దృష్టి…