NTV WebDesk
Author- NTV Telugu-
ఇండియా పాక్ మ్యాచ్‌లో దీన్ని జయించిన జట్టుకే విజయం…
ఇండియా పాక్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఇండియాపై పాక్ ఎప్పడూ గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్రను సృష్టించాలని పాక్ చూస్తున్నది. అయితే, ప్రపంచంలో ఇండియా జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా ఎదిగింది. […] -
పాక్‌కు కింగ్ కోహ్లినే టార్గెట్..!
మాములుగా పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్‌లంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ. అలాంటిది T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పాక్, ఇండియా టీంలు బలంగా ఉన్నాయి. గత రికార్డుల పరంగా చూసుకుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఇండియాదే ఆధిపత్యం. ఈ సారి పాక్ విరాట్ కోహ్లినే టార్గెట్ కానున్నాడా.. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఒక్కసారికూడా ఔట్ చేయలేదు. ఆ జట్టుపై కోహ్లీ 2012లో […] -
సామాన్యుడిని భయపెడుతున్న కాయగూరలు…
రెండు వారాల క్రితం వరకు కూరగాయల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో కాయగూరల ధరలు పెరగడం మొదలుపెట్టాయి. చేతికి రావాల్సిన పంట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మహారాష్ట్రలో ఉల్లి పంట పాడైపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో ఉల్లి ధర రూ.25 వరకు ఉండగా, ఇప్పుడు ఆ ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి ధర ఇప్పుడు రూ.50కి చేరింది. అటు టమోటా ధరలు సైతం […] -
ఆ మహిళలు అస్సలు లావెక్కరట… ఎందుకో తెలుసా?
సాధారణంగా చాలా దేశాల్లో మహిళలు వారికి తెలియకుండానే లావు పెరుగుతుంటారు. ఎంత ప్రయత్నం చేసినా తగ్గినట్టే తగ్గి మరలా లావు పెరిగిపోతుంటారు. దీనికి కారణం ఫుడ్. కొంతకాలం పాటు సమతుల్య ఆహారం తీసుకొని ఆ తరువాత ఇష్టం వచ్చిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. డైట్ మెయింటెయిన్ చేయరు. దీంతో తెలియకుండానే బరువు పెరడగంతో పాటుగా అనవసరంగా రోగాలు కొని తెచ్చుకుంటారు. అయితే, కొరియాలో మహిళలు అస్సలు లావుగా కనిపించరు. పడుచు పిల్లలనుంచి ముసలివాళ్ల వరకు కొరియా దేశంలో […] -
నేడు మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన
నేడు మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటంచనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పంచాయతీ రాజ్ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. PKM UDA (పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రమాణ స్వీకారం, కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొంటారు. -
వారం కిందట లీటర్ పాలు రూ.30 ఇప్పుడు రూ.300… ఎందుకో తెలుసా…!!
ఆ పాలకు గిరాకీ చాలా తక్కువ. ఎవరో కొంతమంది తప్పించి పెద్దగా తాగేవారు కాదు. అందుకే ఆ పాలు చాలా చౌకగా దొరికేవి. లీటర్ పాలు కేవలం రూ.30 కి మాత్రమే దొరికేవి. అయితే, గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్పూర్లో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. డెంగీ జ్వరం వచ్చిన వారిలో ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంది. ప్లేట్లెట్స్ సంఖ్య పెరగాలి అంటే మేకపాలు తాగాలని చాలా మంది సూచిస్తుండటంతో అక్కడి ప్రజలు మేకపాలను పెద్ద ఎత్తున కొనుగోలు […] -
చీకటిపడ్డాక మహిళలను అటు వెళ్లొద్దన్న బీజేపీ నేత… బీఎస్పీ విమర్శలు…
ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మహిళలకు ప్రోత్సహించాల్సిన నేతలు వారిని తక్కువచేసి మాట్లాడుతున్నారు. చీకటి పడ్డాక మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కుటుంబంలోని పురుషులను తోడుగా తీసుకెళ్లడం మంచిది అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. వారణాసిలోని బజర్డిహా ప్రాంతంలో వాల్మీకి బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లో మహిళా […] -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే వారు ప్రొబేషన్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఇది ఊహించని పరిణామం. బయోమెట్రిక్ హాజరు లేదని అక్టోబర్ జీతంలో 10 నుంచి 50శాతం వరకు తగ్గించారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్22 వరకు హాజరు డాటా ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలి. కానీ బయోమెట్రిక్ మెషీన్లలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకుండా తమ జీతాల్లో కోత విధించడమేంటని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా […] -
తగ్గేదిలేదంటున్న దీదీ… ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా…
దేశంలో బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న దీదీ కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారు. బీజేపీ పాలన నుంచి దేశాన్ని కాపాడాలి అనే లక్ష్యంగానే దీదీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బెంగాల్లో ఇచ్చిన విజయాన్ని స్పూర్తిగా తీసుకొని గోవాలో పార్టీ పోటీ చేయడానికి సిద్ధమయింది. త్వరలోనే గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 40 స్థానాలున్నా గోవా అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ చూస్తున్నది. ఈనెల […] -
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద
గత కొన్ని రోజులగా శ్రైశైలం జలాశయానికి వరదనీరు రాగా, ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గుతోంది. ఎగువన ఉన్న జలాశాయల్లోకి వరద నీరు తగ్గడంతో గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ఇన్‌ఫ్లో: 16,135 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 70,831 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రైశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880.10 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు […]
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!