బీజేపీపై ఆర్మూర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ దేశంలో భారతీయ జనకంటక పార్టీగా మారిందని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ వరసగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతోందని విమర్శించారు. మోడీపాలనకు వ్యతిరేకంగా బిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో రాణిస్తోందని, క్రీడలను, క్రీడాకారులను సీఎం కేసీఆర్ […]
ప్రపంచవ్యాప్తంగా చైనా కంపెనీలకు చెందిన మొబైళ్లు ఎలా విస్తరిస్తున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు మార్కెట్లో దొరుకుతుండటంతో విచ్చలవిడిగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, చైనా మొబైళ్ల ద్వారా వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వం సేకరిస్తోందనే అరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చైనా మొబైళ్లు కొన్ని పదాలను ఆటోమేటిక్‌గా సెన్సార్‌షిప్ చేస్తోందని లిథుయేనియా ప్రభుత్వం ఆరోపిస్తోంది. చైనాకు చెందిన మొబైళ్లను విసిరికొట్టాలని, భవిష్యత్తులో చైనాకు చెందిన మొబైళ్లకు కొనుగోలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. చైనా మొబైళ్లను […]
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చాలామంది భక్తులు తిరుపతిలోని అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఒకసారి కాలినకడన ఎక్కడమే కష్టమైన ఈ రోజుల్లో ఓ భక్తులు 300 సార్లు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. 1996లో మొదటిసారి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకున్న శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాసరావు […]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డ్రగ్స్ వ్యవహారంపై ఓ ట్వీట్ చేశారు. గుజరాత్‌లో తీగలాగితే ఏపీలో డొంక కదిలిందని, రూ.72 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తాలిబన్లతో మాట్లాడి ఏపీకి తెచ్చిన డ్రగ్స్ డాన్ ఎవరు అంటూ అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు. తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేశారని నారా లోకేష్ ట్వీట్ […]
కోతుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎప్పుడు వాటికి కోపం వస్తుందో చెప్పలేము. అందుకే వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్టేసి ఉన్న కోతికి కోపం అధికంగా ఉంటుంది. అలాంటి కోతి పక్కన నిలబడి ఫొటో దిగడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే అవుతుంది. ఇలానే ఓ యువతి చెట్టుకు కట్టేసిన కోతి పక్కన నిలబడి ఫొటో దిగేందుకు ప్రయత్నం చేసింది. అసలే కోపంగా ఉన్న ఆ కోతి ఒక్కసారిగా ఆ యువతి […]
ప్రస్తుతం ప్రధాని మోడి అమెరికా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈరోజు అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, వచ్చేనెల 6,7 తేదీల్లో ఇటలీలో ప్రపంచ శాంతి సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం లభించింది. అయితే, ఆ సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్రం ఆమెకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో మమతా బెనర్జీ మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడి ఎక్కడికైనా […]
ఈరోజు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞన్ భవన్‌లో ఈ భేటీ జరుగుతున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో భేటీ అమిత్‌షా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి […]
ఆఫ్ఘనిస్తాన్‌లో మీడియాపై మరోసారి తాలిబన్లు ఉక్కుపాదం మొపుతున్నారు. ఇప్పటికే తాలిబన్లు ఆంక్షల పేరుతో మీడియా గొంతు నొక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 11 నియమాలు పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చి మరింతగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘన్ నుంచి వందలాది జర్నలిస్టులు ఇప్పటికే దేశం వదలివెళ్లిపోయారు. మతానికి విరుద్ధంగా, ప్రభుత్వ పెద్దలకు విరుద్ధంగా కంటెంట్‌ను ప్రచురించకుండా ఉండేందుకు ఈ విధమైన నిబంధనలు తీసుకొచ్చినట్టు విదేశీమీడియా సంస్థలు చెబుతున్నాయి. 11 నియమాలు అమలు చేస్తే మీడియా గొంతు శాశ్వతంగా […]
బిగ్ బాస్ సీజన్ 5 షో థర్డ్ ఎలిమినేషన్ వరకూ వచ్చేసింది. శనివారం హౌస్ సభ్యులను కలిసిన నాగార్జున కాస్తంత సీరియస్ గా ఉన్నాడు. దాంతో పార్టిసిపెంట్స్ సైతం కొంత కంగారు పడ్డారు. కొందరైతే నాగార్జునను అలా సీరియస్ లుక్ లో చూడలేక పోతున్నామన్నారు. చివరకు కాస్తంత మూడ్ మార్చుకుని నాగ్ మామూలు మనిషి అయ్యే ప్రయత్నం చేశాడు. శనివారం వేదిక మీదకు రావడంతోనే ‘హౌస్ లో అండర్ స్టాండింగ్ కన్నా… మిస్ అండర్ స్టాండింగ్ ఎక్కువైంద’ని […]
ఓ అభయారణ్యంలో తమకు ఎదురేలేదని వికటాట్టహాసంతో చెలరేగిపోతున్న హైనాల గుంపుపై పులి వచ్చి పంజా విసిరితే ఎలా ఉంటుందో ‘రిపబ్లిక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన మాటల దాడి చూస్తే అలానే అనిపించింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక కాస్త రాజకీయ సభగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని అంతా కక్కేశారు. సుధీర్ఘ ప్రసంగంతో సినిమాపై కంటే బయట విషయాలపైనే చీల్చిచెండాడేశాడు. పవన్ పంచ్ డైలాగులకు ఇండస్ట్రీలోని […]