బద్వేల్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో అట్లూరు మండలంలోని చిన్నమరాజుపల్లె గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని, తాము బద్వేల్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామ పొలిమేర్లలో బ్యానర్‌ను కట్టారు. ఏ నాయకుడు తమ గ్రామంలోకి రావొద్దని, గ్రామానికి రోడ్డు […]
తైవాన్ సరిహద్దుల్లో మళ్లీ రడగ మొదలైంది. చైనాకు చెందిన 30 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడ్డాయి. నెల రోజుల వ్యవధిలో 60సార్లు చైనా విమానాలు చొరబడినట్టు తైవాన్ పేర్కొన్నది. దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్ కుడా మిలటరీ ఆపరేషన్‌ను నిర్వహించింది. తైవాన్ యుద్ధ విమానాలు విన్యాసాలను ప్రదర్శించాయి. తైవాన్ పై చైనా ఆధిపత్యాన్ని సాగనివ్వబోమని మరోసారి తైవాన్ స్పష్టం చేసింది. తైవాన్ తమ భూభాగమే అని ఇప్పటికే చైనా ప్రకటిస్తూ వస్తున్నది. దానికి తైవాన్ అంగీకరించడం […]
భవానీపూర్ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. సెప్టెంబర్ 30 వ తేదీన భవానీపూర్‌కు ఎన్నికలు జరగ్గా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి రౌండ్ నుంచే మమతా బెనర్జీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీ నేత ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,389 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మమతా విజయంతో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. Read: దుబాయ్ […]
దుబాయ్ లో దుబాయ్ ఎక్స్‌పో 2020 ఎగ్జిబిషన్ జరుగుతున్నది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆరు నెలలపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగనున్నది. దీనికోసం దుబాయ్ ఎడారి ప్రాంతంలోని 1080 ఎకరాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఓ అద్భుతలోకాన్ని సృష్టించింది. 192 దేశాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనబోతున్నాయి. ఆసియాలో జరగబోతున్న తొలి అంతర్జాతీయ ఎక్స్ పో కావడంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటి వరకు ఇలాంటి భారీ అంతర్జాతీయ ఎక్స్‌పోలను […]
సెప్టెంబర్ 30 వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేశారు. బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటిగ్ జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12 రౌండ్లు ముగిసే సరికి మమతా బెనర్జీ 35 వేల ఓట్ల మేజారిటీని […]
పంజాబ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కెప్టెన్ రాజీనామా తరువాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చన్నిని ఎంపిక చేసింది. చన్నీ ప్రమాణ స్వీకారం తరువాత పీసీపీ అధ్యక్షుడు సిద్ధూ రాజీనామా చేయడం, ఆ తరువాత రాజీ కుదరడంతో తిరిగి ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవడంతో అక్కడ ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేని విధంగా ఉన్నాయి. పంజాబ్ రాజకీయాలను రాజస్థాన్, చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రులు వెయికళ్లతో గమనిస్తున్నారు. పంజాబ్ లో జరిగినట్టుగానే రాజస్థాన్, చత్తీస్‌గడ్‌లో కూడా జరిగే […]
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటుగా ఎమ్మెల్యేపదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో త్రిముఖపోటీ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ […]
జమ్మూ కాశ్మీర్‌లో మరో కుట్ర చేసేందుకు పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడేందుకు పరోక్షంగా పాక్ సహకరిస్తూనే డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను దేశ సరిహద్దుల్లో జారవిడుస్తోంది. ఇప్పటికే ఇలాంటి డ్రోన్లను ఆర్మీ అధికారులు బోర్డర్‌లో గుర్తించి వాటిని పేల్చి వేశారు. కాగా తాజాగా మరో డ్రోన్ ఇండియా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును పసుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల […]