అమెరికాకు చెందిన ఇద్దరు వైద్యశాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యూరీ. శరీరంపై ఉష్ణగ్రాహకాలు, స్పర్శ అనే అంశంపై ఇద్దరూ శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. నిత్య జీవితంలో శరీరంపై ఉష్ణగ్రాహకాల ప్రభావాన్ని తేలిగ్గా తీసుకుంటామని, కానీ, మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, స్పర్శ, చలి వంటివి ఎలా ప్రారంభం అవుతాయి, వాటికి నాడులు ఎలా స్పందిస్తాయి అనే వాటిని డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌లు సమాధానం కనుగోన్నారని నోబెల్ జ్యూరీ అభిప్రాయపడింది. వీరి పరిశోధనలను గుర్తించిన జ్యూరీ సభ్యులు […]
ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. పరిమితికి మించి యూరేనియం నిల్వలను పెట్టుకుంటోందని చెప్పి ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ వేలకోట్ల రూపాయలను నష్టపోయింది. కాగా, ఆంక్షల కారణంగా నష్టపోయిన 10 బిలియన్ డాలర్లను అమెరికా వెంటనే చెల్లించాలని, ఆ తరువాతే అణు ఒప్పందంపై చర్చలు జరపాలని, అణు ఒప్పందంపై అమెరికానే ముందుకు రావాలని ఇరాన్ పేర్కొన్నది. 2018 నుంచి ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. అయితే, బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత […]
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేస్తున్నారు. అటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. […]
అందరిదీ ఒకదారైతే, ఉత్తర కొరియా దేశానిది మరోక దారి. తమను విమర్శించిన వారికి వార్నింగ్‌లు ఇవ్వడం అన్నది వారికి కామన్. దక్షిణ కొరియా, అమెరికాపై ఒంటికాలిపై విరుచుకుపడే ఉత్తర కొరియా ఇప్పుడు ఏకంగా ఐరాసాను టార్గెట్ చేసింది. ఐరాసాపై విరుచుకుపడింది. ఇటీవలే నార్త్ కొరియా దేశం ఓ క్షిపణిని ప్రయోగించింది. సూపర్ సోనిక్ క్షిపణీ వ్యవస్థను సొంతం చేసుకోవడంతో వివిధ దేశాలు ఆందోళన చేస్తున్నాయి. నార్త్ కొరియాతో ఎప్పటికైనా డేంజర్ అని, వీలైనంత వరకు ఆ […]
మాములుగా గ్రామాల్లో పట్టణాల్లో చెట్లను దూర రూరంగా పెంచుతారు. అదే అడవుల్లో తీసుకుంటే పెద్ద పెద్ద చెట్లు పెరుగుతాయి. గుబురుగా ఉండే విధంగా పెద్ద పెద్ద చెట్లు పెరుగుతుంటాయి. అడవుల్లో ఉండే చెట్లపైని కొమ్మలు ఒకదానికొకటిగా కలిసి ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, క్రౌన్ షైనెష్ చెట్లు అందుకు విరుద్దంగా పెరుగుతుంటాయి. ఎత్తుగా ఒక చోట పెరిగే ఈ చెట్ల కొమ్మలు, చిటారు భాగాలు కలిసి ఉండవు. ఎంత ఎత్తుగా పెరిగినప్పటికీ పైన గ్యాప్‌తోనే పెరుతాయి. […]
కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనాతో మరణించినట్లు దృవీకరణ పత్రం లేకున్నాకూడా పరిహారం అందించాలని, ఈ పరిహారం కోసం ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జాతీయ విపత్తున నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన విధంగా రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఏ రాష్ట్రం నిరాకరించరాదని, […]
బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈరోజు లేదా రేపటిలోగా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రావాలని పవన్‌ను కోరతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందని అన్నారు. పవన్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. విమర్శలు చేసేటప్పుడు […]
సాధారణంగా ఉడతలు వర్షాకాలంలో ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. ఆహారాన్ని సేకరించి పెట్టుకున్నాక వాటిని చలి కాలంలో వాడుకుంటాయి. చిన్న చిన్న గుంతలు తీసి, లేదా ఎక్కడైనా ఇంట్లోనో ఆహారాన్ని భద్రంగా దాచుకుంటాయి. నార్త్ డకోటాలో నివశించే ఫిషర్ నాలుగురోజులపాటు కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత తన కారు ఇంజన్ భాగాన్ని చెక్ చేసేందుకు బానెట్ ఓపెన్ చేసి చూడగా అందులో ఏకంగా 152 కేజీల వాల్‌నట్స్ కనిపించారు. దీంతో ఫిషర్ […]
ఇటలీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇటలీలోని మిలాన్ నగరంలో ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మిలాన్ లోని లినేట్ విమానాశ్రయం నుంచి సర్దీనియా దీవికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ జెట్ సింగిల్ ఇంజన్ పీసీ 12 విమానం బయలుదేరిన వెంటనే ఇంజన్‌లో మంటలు అంటుకున్నాయి. ఆ విమానం ఓ భవనంపై కూలిపోయింది. దీంతో భవనంతో పాటుగా బయట పార్క్ చేసిన కార్లకు నిప్పు అంటుకున్నది. […]