లఖీంపూర్ ఖేరి ఘటనపై యూపీ అట్టుడికి పోతున్నది. ఆందోళన చేస్తున్న రైతల మీదకు కేంద్రమంత్రి కుమారుడి కారు దూసుకు వచ్చింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహించిన రైతులు కాన్వాయ్‌లోని కార్లను ధ్వంసం చేసిన ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై లఖీంపూర్ ఖేరీ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ యూపీ ముఖ్యమంత్రి యోగి […]
యూపీలో రైతుల ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీసింది. నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లఖీంపూర్ ఖేరీ కి వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు అడ్డుకొని బలవంతంగా ఆయన్ను ఇంటికి తరలించారు. మరోవైపు ప్రియాంకా గాంధీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి రంధ్వానా, చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి బఘేల్‌లు యూపీకి […]
ఏడారి దేశం ఒమన్‌లో గత కొన్ని గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిత్యం ఎండలు, చుట్టు ఇసుకతో కప్పబడిన ఒమన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నడుములోతులో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో వర్షం మరిత భీభత్సం సృష్టించే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు తీరప్రాంతంలోని […]
బద్వేల్ నియోజక వర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు బరిలో ఉంటాయని అనుకున్నారు. వైసీపీ ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించింది. జనసేన, టీడీపీలు కూడా పోటీలో ఉంటాయని అనుకున్నారు. కానీ, సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మొదట జనసేన పార్టీ ప్రకటించింది. ఇదే బాటలో టీడీపీ కూడా నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి మొదట డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని అనుకున్నారు. కాని, జనసేన నిర్ణయం […]
పాతతరం విమానాలను వియానాయ సంస్థలు వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తుంటాయి. ఇలానే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ విమానాన్ని ఇటీవలే తుక్కుకింద విక్రయించారు. అలా విక్రయించిన విమానాన్ని ఢిల్లీలోని రహదారి గుండా తరలిస్తుండగా వంతెన కింద ఇరుక్కుపోయింది. వంతెన కింద ఇరుక్కుపోవడంతో ఆ దృశ్యాలను కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని సేవల నుంచి ఎయిర్ […]
అంతరిక్షం ఎప్పుడూ చాలా ఆసక్తిగా ఉంటుంది. అంతరిక్షంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అ కేంద్రంలో కొన్ని రకాల పంటలు పండిస్తున్నారు. అయితే, ఇప్పుడు అంతరిక్షంలో మందులను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భూమిపైన తయారయ్యే మందులపై కొన్నిరకాల సూక్ష్మజీవుల ప్రభావం ఉంటుంది. కానీ, అంతరిక్షంలోని పీడనం, వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడ ఎలాంటి సూక్ష్మజీవుల ప్రభావం ఉండదు. దీంతో స్పేస్‌లో మందులను తయారు చేస్తే […]
కరోనా కేసులు రాష్ట్రంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 45,481 కరోనా పరీక్షలు చేయగా 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,52,763కి చేరింది. ఇందులో 20,28,202 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,357 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,204కి చేరింది. […]
డ్రగ్స్ కేసులో ఈరోజు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని 5 ప్రాంతాల్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఉదయం నుంచి ప్రశ్నించారు. ఆర్యన్ సెల్‌ఫోన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా […]
రిపబ్లిక్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నది. దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుల నుంచి సినిమా తారల వరకు, రాజకీయనాయకుల వరకు ఈ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. రిపబ్లిక్ సినిమాకు మంచి వస్తున్నాయని వింటున్నానని, త్వరలోనే తాను ఈ సినిమాను చూస్తానని ట్వీట్ చేశారు. అసుపత్రిలో […]