భవానీపూర్ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. సెప్టెంబర్ 30 వ తేదీన భవానీపూర్‌కు ఎన్నికలు జరగ్గా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి రౌండ్ నుంచే మమతా బెనర్జీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీ నేత ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,389 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మమతా విజయంతో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ సంబరాలు అంబరాన్ని తాకాయి.