దక్షిణ చైనా సముద్రంతో పాటుగా, డ్రాగన్ దేశం హిందు మహాసముద్రంపై కూడా కన్నేసింది. ఈ ప్రాంతంలోని జలాలపై ఆదిపత్యం సాధించేందుకు అనేక ప్రాంతాల్లో పోర్టులను నిర్మిస్తోంది. హిందూ మహాసముద్రం పరిధిలోని చిన్న చిన్న దేశాల్లో పోర్టులను నిర్మిస్తూ ఆయా ప్రాంతాలపై పట్టు సాధిస్తోంది. దీంతో అలర్టైన ఇండియా హిందు మహాసముద్రంపై నిఘాను పెంచేందుకు చర్యలు చెపట్టింది. మారిషస్‌లోని ఉత్తర అగలేగాలో 25 కోట్ల డాలర్లతో పోర్టును నిర్మిస్తోంది. ఇందులో 3000 మీటర్ల పొడవైన రన్‌వే కీలకమైనది. పెద్ద […]
చేతిలో అధికారం ఉండి అభివృద్ధి చేయాలనే బలమైన కోరిక ఉంటే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చని నితిన్ గడ్కారి నిరూపించారని ఎన్సీపీ నేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఈరోజు అహ్మద్ నగర్‌లోని ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కారీతో కలిసి వేదికను పంచుకున్న శరద్ పవార్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అహ్మద్ నగర్‌లో సుదీర్ఘకాలంగా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని నితిన్ గడ్కారి ఈరోజు ప్రారంభించబోతున్నారని తెలిసి అక్కడికి వచ్చానని అన్నారు. నితిన్ గడ్కారి ఉపరితల […]
బీహార్‌లో ఈనెల 30 వ తేదీన కుషేశ్వర్ ఆస్థాన్, తారాపూర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్న సమయంలో లోక్ జనశక్తి పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ పేరును, గుర్తును ప్రీజ్ చేసింది. పశుపతి పారస్, చిరాగ్ పాశ్వాన్ మధ్య గత కొన్ని రోజులుగా పార్టీ విషయంపై పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నది. దీంతో ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఆ […]
ఈనెల 30 వ తేదీన కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీ తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్ధిని ప్రకటించారు. అయితే, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయమని ఒత్తిడి వచ్చిందని, చనిపోయిన […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లాలోని నల్ల చెరువులో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చానని అన్నారు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయాల్లోనే ఉంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు. వైసీపీ నాయకులు తనకు శతృవులు కాదని, అద్భతమైన పాలన ఇచ్చి ఉంటే ఇలా […]
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్ధి, నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తతలకు దారితీసింది. దిల్‌షుఖ్ నగర్ నుంచి పార్టీ ర్యాలీని చెపట్టానలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్‌కు చేరుకున్నారు. ఎల్బీనగర్‌లోని కూడలిలో ఉన్న శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్త కళ్యాణ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్ధిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. […]
హుజురాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక ఈనెల 30 వ తేదీన జరగబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉంటే, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధిపై అనేక చర్చలు జరిగాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖను అనుకున్నా, ఆమె తిరస్కరించడంతో తెరపైకి అనేక పేర్లు వచ్చాయి. […]
నాగచైతన్య- సమంతలు విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటనతో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. నాగ చైతన్య – సమంత విడిపోవడంపై అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. సమంత – నాగ చైతన్యలు విడిపోవడం దురదృష్టకరం అని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం అని, ఇద్దరూ తనకెంతో దగ్గరివారని, సమంతతో తన కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైనదని, దేవుడు ఇద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని […]