లఖీంపూర్ ఖేరి ఘటనపై యూపీ అట్టుడికి పోతున్నది. ఆందోళన చేస్తున్న రైతల మీదకు కేంద్రమంత్రి కుమారుడి కారు దూసుకు వచ్చింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహించిన రైతులు కాన్వాయ్‌లోని కార్లను ధ్వంసం చేసిన ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై లఖీంపూర్ ఖేరీ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. రైతుల పట్ల సంయమనంతో, సహనంతో వ్యవహరించాలని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, అదే విధంగా సీబీఐ చేత విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. అన్నదాతల పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలని వరుణ్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
Read: చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రిని రానివ్వొద్దు… యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం…