యూపీలో రైతుల ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీసింది. నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లఖీంపూర్ ఖేరీ కి వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు అడ్డుకొని బలవంతంగా ఆయన్ను ఇంటికి తరలించారు. మరోవైపు ప్రియాంకా గాంధీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి రంధ్వానా, చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి బఘేల్‌లు యూపీకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, వారి విమానాలు లక్నోలో దిగేందుకు అనుమతులు ఇవ్వకూడదని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. లఖీంపూర్ ఖేరీ వెళ్లడం వలన అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ప్రభుత్వం ఆదేశించింది.
Read: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కలకలం…