రాజ్యసభ సమావేశాలకు ఎంతమంది హాజరయ్యారు అనే దానిపై రాజ్యసభ సచివాలయం గణాంకాలను తయారు చేసింది. అధికారుల లెక్కల ప్రకారం గడిచిన ఏడు రాస్యసభ సమావేశాలకు 78 శాతం మంది ఎంపీలు రోజూ హాజరవుతున్నట్టుగా గుర్తించారు. అందులో 30శాతం మంది క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. 2019 నుంచి 2021 వరకు మొత్తం ఏడు రాజ్యసభ సమావేశాలు జరిగాయి. రాజ్యసభలో 225 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా రాజ్యసభకు హాజరైనపుడు తప్పనిసరిగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. 248 వ సమావేశం […]
సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు ఫేస్‌బుక్ డౌన్ అయింది. పలు సమస్యల కారణంగా ఫేస్ బుక్ ఓపెన్ కాలేదు. ఫేస్‌బుక్‌తో పాటుగా దాని అనుబంధ సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు కూడా ఓపెన్ కాలేదు. దీంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియన తికమకపడ్డారు. చాలామంది ట్విట్టర్‌లో పోస్టులు, మీమ్స్ పెట్టారు. అయితే, ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తిరిగి రిస్టోర్ అయింది. […]
ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇక, బాధిత రైతులను పరామర్శించేందుకు లఖీంపూర్‌కు బయలుదేరిన ప్రియాంకగాంధీని పోలీసులు అడ్డుకొని గృహనిర్భంధం చేసిన సంగతి తెలిసిందే. 28 గంటలుగా ఆమె గృహనిర్భంధంలోనే ఉండిపోయారు. గృహనిర్భంధంలోనే ఉంటూ నిరసనలు చేస్తున్నారు. ఇక, పంజాబ్ డిప్యూటీ సీఎం సిఖిందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, పంజాబ్ ఎమ్మెల్యేలను కూడా యూపీ సరిహద్దుల్లో అడ్డుకున్నారు పోలీసులు. […]
ప్రేమలు వరకు ఓకే అదే ప్రేమ పెళ్లి వరకు వచ్చే సరికి అనేక అడ్డంకులు ఎదురౌతుంటాయి. ప్రేమ పెళ్లిళ్ల తరువాత ఎన్ని కష్టాలు ఎదురవుతాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో తల్లిదండ్రుల మద్దతు ఉంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నవారి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, ప్రేమ పెళ్లిళ్లకు ఎంత మంది పేరెంట్స్ అనుకూలంగా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ట్రూలీమ్యాడ్లీ అనే డేటింగ్ యాప్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్ తల్లులు తమ […]
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ సమయంలో వాహనాల నుంచి వచ్చే కాలుష్యంతో పాటుగా హారన్ నుంచి వచ్చే శబ్ధకాలుష్యంకూడా పెరిగిపోతున్నది. ఫలితంగా అనేక అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కో వాహనం ఒక్కో రకమైన హారన్ శబ్దంతో కర్ణకఠోరంగా మారుతున్నది. వీటిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ఉపరితల రావాణ శాఖ ముందుకు వచ్చింది. కొత్త రూల్స్ ను తీసుకురాబోతున్నది. వాహనాల్లో హారన్ శబ్దాన్ని మార్చాలని నిర్ణయం తీసుకుంది. హారన్ శబ్దాలు కఠినంగా ఉండకుండా హాయిగా ఉండేలా చూడాలని ఇప్పిటికే […]
దేశంలో మళ్లీ ఉల్లి ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మనదేశంలో అత్యధికంగా ఉల్లి పంట మహారాష్ట్రలో పండుతుంది. అయితే, తుఫాన్, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఉల్లిపంట దెబ్బతిన్నది. దీంతో డిమాండ్‌కు తగినంత ఉల్లిపంట లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఉల్లి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎంతమేర ఉల్లి ధరలు పెరుగుతాయి, ఎన్ని రోజులకు తిరిగి కొత్త పంట అందుబాటులోకి వస్తుంది అన్నది […]
యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఈరోజు ఉదయం నుంచి అన్ని రాష్ట్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ధ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో కలెక్టరేట్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. లఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి కుమారుడి కారు […]
కాసేపు సోషల్ మీడియా పనిచేయకపోతే ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పడతారో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏకంగా ఏడు గంటలపాటు సోషల్ మీడియా పనిచేయకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉండదు. సోమవారం రాత్రి 9:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు సుమారు 7 గంటల పాటు సోషల్ మీడియా ఆగిపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు నిలిచిపోయాయి. పనిచేయలేదు. దీంతో ఏమైందో తెలియక కోట్లాది మంది భయపడ్డారు. అయితే, ఈరోజు […]
మేషం:- సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. వృషభం:- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల వేధింపులు, సహోద్యోగులతో చికాకులు తప్పవు. ఏ విషయంలోనూ […]