ఇటలీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇటలీలోని మిలాన్ నగరంలో ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మిలాన్ లోని లినేట్ విమానాశ్రయం నుంచి సర్దీనియా దీవికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ జెట్ సింగిల్ ఇంజన్ పీసీ 12 విమానం బయలుదేరిన వెంటనే ఇంజన్‌లో మంటలు అంటుకున్నాయి. ఆ విమానం ఓ భవనంపై కూలిపోయింది. దీంతో భవనంతో పాటుగా బయట పార్క్ చేసిన కార్లకు నిప్పు అంటుకున్నది. రోమేనియాకు చెందిన బిలీనియర్ పెట్రెస్కూ కుటంబంతో కలిసి సర్దీనియాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై అదికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
Read: యూపీ సీఎంకు బీజేపీ ఎంపీ లేఖ… సీబీఐ విచారణకు ఆదేశించండి…