అమెరికాకు చెందిన ఇద్దరు వైద్యశాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యూరీ. శరీరంపై ఉష్ణగ్రాహకాలు, స్పర్శ అనే అంశంపై ఇద్దరూ శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. నిత్య జీవితంలో శరీరంపై ఉష్ణగ్రాహకాల ప్రభావాన్ని తేలిగ్గా తీసుకుంటామని, కానీ, మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, స్పర్శ, చలి వంటివి ఎలా ప్రారంభం అవుతాయి, వాటికి నాడులు ఎలా స్పందిస్తాయి అనే వాటిని డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌లు సమాధానం కనుగోన్నారని నోబెల్ జ్యూరీ అభిప్రాయపడింది. వీరి పరిశోధనలను గుర్తించిన జ్యూరీ సభ్యులు వైద్యశాస్త్రంలో వీరికి నోబెల్ బహుమతిని ప్రకటించింది. డేవిడ్ జూలియస్ యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, ఆర్డెమ్ కూడా క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో స్క్రిస్స్ రీసెర్చ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
Read: ముందు వెయ్యి కోట్లు ఇవ్వండి… ఆ తరువాత మాట్లాడుకుందాం…