మాములుగా గ్రామాల్లో పట్టణాల్లో చెట్లను దూర రూరంగా పెంచుతారు. అదే అడవుల్లో తీసుకుంటే పెద్ద పెద్ద చెట్లు పెరుగుతాయి. గుబురుగా ఉండే విధంగా పెద్ద పెద్ద చెట్లు పెరుగుతుంటాయి. అడవుల్లో ఉండే చెట్లపైని కొమ్మలు ఒకదానికొకటిగా కలిసి ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, క్రౌన్ షైనెష్ చెట్లు అందుకు విరుద్దంగా పెరుగుతుంటాయి. ఎత్తుగా ఒక చోట పెరిగే ఈ చెట్ల కొమ్మలు, చిటారు భాగాలు కలిసి ఉండవు. ఎంత ఎత్తుగా పెరిగినప్పటికీ పైన గ్యాప్‌తోనే పెరుతాయి. మిగతా చెట్ల మాదిరిగా ఈ చెట్లు ఎందుకు కొమ్మలు ఒకదానికొకటి కలసి ఉండవు అనే దానిపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ కూడా సరైన కారణం కనుక్కొలేకపోయారు. వృక్షజాతుల్లో ఒక్కో చెట్టుకు ఒక్కో లక్షణం ఉంటుందని ఈ జాతికి చెందిన చెట్ల లక్షణం అయి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కనుక్కొలేకపోయారు.
Read: సుప్రీంకోర్టు కీలక తీర్పు: వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాల్సిందే…