స్మార్ట్ ఫోన్ లేకుంటే కొద్దిసేపు కూడా కాలం నడవదు. కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఇంట్లో కూరగాయల దగ్గరి నుంచి ఆఫీస్ మీటింగుల వరకు ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే విధంగా స్మార్ట్ ఫోన్ వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లలోని యూజర్ డేటా ఆధారంగా కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, కరోనా కాలంలో ఈ సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. యాప్‌లు, మెసేజ్‌లు, మెయిల్ రూపంలో వైరస్‌లను మోబైల్‌లోకి జొప్పించి విలువైన సమాచారాన్ని రాబడుతున్నారని, ఫోన్‌లు పదేపదే చార్జింగ్ అయిపోతున్నా, తెలియకుండానే యాప్ లు ఇస్టాల్ డిలీట్ అవుతున్నా వైరస్ ఉందని అర్ధం చేసుకొని వెంటనే డిలీట్ చేసుకునే ప్రయత్నం చేయాలని లేదంటే ఫోన్లలోని విలువైన సమాచారం దొంగిలించబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read: పంజాబ్‌లో వేడెక్కిన రాజకీయం… దూకుడు పెంచిన సిద్దూ