మేషం :- ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులెదురవుతాయి. వృషభం :- శస్త్రచికిత్సలు విజయవంతం కావటంతో డాక్టర్లు పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలతో పాటు నాగబాబు రాజీనామాను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. సాధారణ ఎన్నికలను తలపించాయి. విష్ణు ప్యానెల్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నువ్వా నేనా అనేలా పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఎట్టకేలకు విష్ణు మంచు అండ్ […]
కేరళకు చెందిన వరుడు ఆకాష్, వధువు ఐశ్వర్య పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఈ నెల 18న ముహూర్తం. అయితే కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా అవకాశం లేదు. ఉన్న ఊరునుంచి పెళ్ళి మంటపానికి వెళ్లేందుకు అవకాశమే లేదు. ఒకవైపు ముహూర్తం దగ్గరపడుతోంది. అటు పెళ్ళి కూతురు, ఇటు పెళ్లి కొడుకు బంధువుల్లో ఒకటే టెన్షన్ ఏంచేయాలి. చివరకు వారికో ఆలోచన వచ్చింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో పెళ్ళికి […]
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం మాటల యుద్ధంగా మారుతోంది. అధికార టీఆర్‌ఎస్ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. టీర్ఎస్ తో కొట్లాడే దమ్ము లేక కాంగ్రెస్ – బీజేపీ ఒక్కటయిందని, నమ్మకాల పార్టీ టీఆర్ఎస్ కు- అబద్దాల పార్టీ బీజేపీకి మధ్య పోటీ నెలకొందన్నారు. ఇది నడమంత్రపు ఎన్నిక. ఎవరు గెల్చినా రెండేళ్ల నాలుగు నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు. రాష్ట్ర […]
అనంతపురం జిల్లా ధర్మవరం లోని కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరాం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి. ధర్మవరం నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ ను రాత్రికి రాత్రే కూల్చివేసిన మునిసిపల్ అధికారుల తీరుపై శ్రీరాం మండిపడ్డారు. మార్కెట్ సమస్యలు మార్కెట్ లో కాకుండా ఎమ్మెల్యే ఇంట్లో పరిష్కారిస్తున్నాడా..?అధికారులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బంట్రోతుల్లా మార్కెట్ మీదకు వదిలాడు. అధికారులు ఎమ్మెల్యే కంట్రోల్ లో పని చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. […]
ఆంధ్రుల పాలిట వరం పోలవరం విషయంలో కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతుండడం అసహనం పెంచుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపిందని తెలుస్తోంది. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం అడగడం లేదు. విద్యుత్కేంద్రానికి […]
ప్రధాని విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29 నుంచి నవంబరు 2 వరకు ఇటలీ, బ్రిటన్లలో పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్‌లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇటలీ పర్యటన తర్వాత మోడీ.. గ్లాస్‌గౌలో జరిగే కాప్-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్‌కు వెళ్లనున్నారు. […]
మన వంటిల్లే వైద్యశాల.. పూర్వకాలంలో వంటింటి ఔషధాలతోనే అనేక వ్యాధుల్ని నయం చేసేవారు. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ముఖ్యమయిందిగా చెబుతారు. వెల్లుల్లిని వంటలో రుచి కోసం వాడుతారు.. కానీ దానిలో అనేక ఔషధాలు పుష్కలంగా ఉన్నాయనేది మీకు తెలుసా. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది చాలామందికి తెలియదు. మీ శరీరంలో చేరే అనేక హానికారక క్రిములను వెల్లుల్లి పోగొడుతుంది. నిత్యం మీకు జలుబు, జ్వరం వస్తోందా? అయితే […]
నిషేధిత గుట్కా, ఖైనీలను కేటుగాళ్ళు వివిధ మార్గాలలో తరలిస్తున్నారు. పోలీసుల కళ్ళు గప్పి లారీల్లో ఎక్కించి సరిహద్దులు దాటించేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం బూర్జీవలస సమీపంలో లారీని తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న లక్షల విలువైన నిషేధిత ఖైనా , గుట్కా లను భూర్జివలస పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీడిపిక్కలు పొట్టు (తొక్కలు)మాటున లారీలో తరలిస్తున్న ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. ఒడిశా నుండి భూర్జివలస మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా […]
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్‌లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తాజాగా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు ప్రకటించారు. యూకేలో కొత్త వేరియంట్ కేసులు ఆగడం లేదు. ఇటు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా వెలుగు […]