హుజూరాబాద్‌లో అసలేం జరుగుతోంది? ఎవరికి వారు గెలుపు ధీమాతో వున్నారు. కానీ ఓటరు మనసులో ఏముంది? వారు ఎవరికి ఓటేస్తారు? అనేది అంతుచిక్కడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్‌లను టెన్షన్ పెట్టిస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం నేతల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. ఓటర్ల మనసులో అసలు ఏముందో తెలియక పార్టీలు తెగ గింజుకుంటున్నాయి. పైకి మీకే ఓటు వేస్తామని ఎవరికి వారు ఓటర్లు చెబుతున్నా తెలియని భయం పార్టీలని బాగా […]
అది 15 అడుగుల ఎత్తు పెరిగిన చెట్టు. ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ పటిష్టమైన భధ్రత ఉంటుంది. 24 గంటలూ చెట్టు దగ్గర ముగ్గురి నుంచి ఐదుగురు పహారా కాస్తుంటారు. ఎవర్నీ ఆ చెట్టు దగ్గరకు అనుమతించరు. అంతేకాదు, వీఐపీలు, వీవీఐపీలు కంచెదాటి చెట్టు వద్దకు వెళ్లాలన్నా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందే. ఇంత భద్రత మధ్య ఉన్న ఆ చెట్టు పేరు ఏంటి? ఎందుకు అంతటి భద్రతను కల్పిస్తున్నారు. తెలసుకుందాం. అది బొధి చెట్టు. […]
ఛత్తీస్‌ఘఢ్-.బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలో ఈ ఎదురు కాల్పులు జరగగా ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఎకె47 రైఫిల్‌లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.
1859లో ఇండియాలో తొలిసారి రైళ్లను ప్రవేశపెట్టారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951లో భారతీయ రైల్వేలను జాతీయం చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం ఇండియా. ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి రైళ్లను వినియోగిస్తుంటారు. అయితే, రైలు పెట్టెల పైభాగంలో ఒక మూల వైపు పసుపు, తెలుపు, గ్రీన్ వంటి గీతలు ఉంటాయి. అవి ఎందుకు వేస్తారో, వాటి అర్థం […]
రుచిలోనూ, పోషకాలను అందించడంలోనూ మునగాకు చాలా విశిష్టమయింది. మన పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనేది సామెత. మన చుట్టూ వున్న అనేక ఆకుకూరలు, కాయగూరలు అద్భుత ఔషధాలు. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మునగచెట్టు అంటే కేవలం మునగకాడలే వాడాలని అంతా అనుకుంటారు. వాటికంటే మునగాకులోనే పోషకాలు ఎక్కువగా వుంటాయి. మనం రోజూ తినే ఆహార పదార్థాలు, కూరగాయలతో ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మునగాకుతో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. […]
సాధారణంగా బార్లు అనగానే మనకు మద్యం గుర్తుకు వస్తుంది. మద్యం తాగేందుకు మందుబాబులు బార్లకు వెళ్తుంటారు. అనేక దేశాల్లో మద్యం ద్వారానే అధిక ఆదాయం సమకూర్చుకుంటారు. అయితే, ఆ దేశంలో కూడా బార్లు ఉన్నాయి. ఆ బార్లలో మద్యం అమ్మరు. మద్యం ప్లేస్‌లో పాలు అమ్ముతుంటారు. పాల కోసమే అక్కడి ప్రజలు బార్లకు వస్తుంటారు. అలాంటి దేశాలు కూడా ఉంటాయా అని షాక్ అవ్వకండి. ర్వాండా దేశ రాజధాని కిగాలీలో ఎక్కడ చూసినా మనకు బార్లు కనిపిస్తుంటాయి. […]
సినీనటి సమంత కేస్ లో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు ప్రకటించనుంది కూకట్ పల్లి కోర్టు. తన వ్యక్తిగత జీవితంపై కథనాలు ప్రసారం చేసి తనపరువుకు భంగం కలిగించారని నటి సమంత కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ సీఎల్ వెంకట్ రావు, సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. బహిరంగ క్షమాపణతో పాటు, తనకు సంబంధించి ఆయా యూట్యూబ్ ఛానెల్స్‌లో వున్న వీడియో లింక్ […]
టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికిన జియో మరో సంచలనానికి సిద్ధం అయింది వినాయకచవితికి జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేయాలని భావించినా కుదరలేదని జియో తెలిపింది. దీంతో ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలయన్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. రిలయెన్స్- గూగుల్ ఆధ్వర్యంలో విడుదల కానున్న ఈ ఫోన్ విడుదల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. చిప్ కొరత కారణంగా దీపావళికి అందుబాటులోకి తీసుకొని రానుంది. […]
భార్యపై ఆయనకు అమితమైన ప్రేమ ఉన్నది. అయితే, తన జీవితంలో ఎక్కువ సమయం సంపాదించేందుకు కష్టపడ్డాడు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసి పిల్లలకు అందించాడు. పిల్లలు ప్రస్తుతం వ్యాపారం చూసుకుంటుండగా, 72 ఏళ్ల పెద్దాయన తన భార్యకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. అందిరిలా కాకుండా ఆ వయసులో కూడా ఢిఫరెంట్‌గా ఆలోచించి ఓ ఇంటిని నిర్మించాడు. ఆ ఇల్లు గోడలు ఆకుపచ్చని రింగులోనూ, పైకప్పు ఎరుపు రంగులో ఉండేలా తీర్చిదిద్దాడు. అయితే, అన్ని ఇళ్ల కంటే ఈ […]
అత్తాపూర్ ఎమ్ ఎమ్ పహాడీలో తల్లితో పాటు ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లి అమ్రీన్, పిల్లలు అక్సా బేగం, అజా బేగం కనిపించకుండా పోయారు. వారు ఎంతకీ వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో సమీప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశాడు భర్త అభరార్. చుట్టూ పక్కల తీవ్రంగా గాలించిన భర్త. ఎక్కడా వాళ్ల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో భార్యా పిల్లలు […]