ఇవాళ, రేపు కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించనుంది 10 మంది కేఆర్ఎంబీ బృందం. కృష్ణానదీ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపధ్యంలో జిల్లాలో పర్యటిస్తోంది కేఆర్ఎంబీ టీమ్. నేడు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ను సందర్శించనుంది. రేపు శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రాలను పరిశీలించనుంది కేఆర్ఎంబీ టీమ్. అనంతరం శ్రీశైలంలో కేఆర్ఎంబీ టీం సమీక్ష […]
గత కొన్ని రోజులుగా హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగాలకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. చైనా హైపర్ సోనిక్ క్షిపణిని ఆగస్టులో ప్రయోగించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆ దేశం రహస్యంగా ఉంచి, అక్టోబర్‌లో బహిర్గతం చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాడార్‌లకు అందకుండా భూమిచట్టూ ఈ క్షిపణి ప్రదక్షిణ చేసి టార్గెట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో పడిండి. అయితే, రాడార్‌లకు అందకుండా ఈ హైపర్ సోనిక్ క్షిపణులు టార్గెట్‌ను ఛేదిస్తుంటాయి. […]
పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతుండడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. తన విధానాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్‌తో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని […]
మనదేశం నుంచి విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ అవసరం ఎంతో ఉంటుంది. అయితే, ఇతర దేశాల్లో పర్యటించాలి అంటే తప్పనిసరిగా వీసా కావాలి. కానీ, కొన్ని దేశాల పాస్ పోర్ట్‌లు ఉంటే చాలు వివిధ దేశాల్లో ఎంచక్కా పర్యటించి రావొచ్చు. వీసాతో అవసరం లేదు. సింగపూర్, జపాన్ దేశాలకు సంబంధించిన పాస్‌పోర్టులు ఉంటే చాలు. వీసాలతో అవసరం లేకుండా 192 దేశాలకు వెళ్లిరావొచ్చు. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్‌పోర్టులు ఇచ్చే దేశాల ఆధారంగా ఈ వెసులుబాటు […]
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఎన్నిక నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరుగనుంది ఎన్నిక. మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగిస్తూ ఈనెల 12న తీర్మానం చేశారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్, […]
తెలుగు సినీ ప్రేక్షకులకు చిర పరిచితుడైన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు గత రాత్రి మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని పట్టుదల ఆయనలో కనిపించింది. టాలీవుడ్‌లో […]
హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ కి మంచి డిమాండ్ ఉన్నది. కేవలం హైదరాబాద్ కు మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు కూడా ఈ బిర్యానీ ఎగుమతి అవుతుంటుంది. అయితే, భాగ్యనగరంలో ఈ బిర్యానీ ఒక్కటి మాత్రమే కాదు. ఎన్నో రకాల వంటకాలు ఫేమస్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. లెగ్‌పీస్ జాయింట్ పీస్ బిర్యానీ. డొన్నె బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ, మండీ బిర్యానీ, ఇందులో డొన్నె […]
చేపల కోసం గాలం వేస్తున్న బాలుడిని లాక్కెళ్లిన మొసలి ఉదంతం ఇది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నది ఒడ్డున కూర్చుని చేపలకు గాలం వేస్తున్నాడు ఓ బాలుడు. నదిలో మొసలి వుందన్న సంగతి ఆ చిన్నారికి తెలీదు. దీంతో ఆ మొసలి దాడిచేసి కుర్రాడిని లాక్కెళ్లిపోయింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగరలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని […]
ఉత్తరప్రదేశ్‌లోని లకీంపూర్ కేర్ దాడిలో చనిపోయిన రైతుల చితాభస్మాన్ని ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు రైతు సంఘాల నాయకులు శ్రీనివాసరావు, గపూర్. గన్నవరం విమానాశ్రయంలో చితాభస్మాన్ని తీసుకువచ్చిన రైతులకు స్వాగతం పలికారు మాజీ మంత్రి వడ్డే శోభనద్రీశ్వరరావు, ఇతర రైతు సంఘాల నాయకులు. లకీంపూర్ కేర్ దాడి చేసిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాని వెంటనే చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాని బర్తరఫ్ చేయాలని […]
తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అంతా సిద్ధం అయింది. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ప్రయోగాత్మకంగా మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సెంటర్ల వద్ద ప్రతి […]