నమ్మకాల పార్టీ టీఆర్ఎస్- అబద్దాల పార్టీ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం మాటల యుద్ధంగా మారుతోంది. అధికార టీఆర్‌ఎస్ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. టీర్ఎస్ తో కొట్లాడే దమ్ము లేక కాంగ్రెస్ – బీజేపీ ఒక్కటయిందని, నమ్మకాల పార్టీ టీఆర్ఎస్ కు- అబద్దాల పార్టీ బీజేపీకి మధ్య పోటీ నెలకొందన్నారు. ఇది నడమంత్రపు ఎన్నిక. ఎవరు గెల్చినా రెండేళ్ల నాలుగు నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కాదని ఎన్నిక జరుగుతుందా.. ఈటల రాజీనామా చేసింది రాజకీయ స్వార్థంతోనే అన్నారు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిండు. పెంచి పెద్ద చేసిన సీఎంను గుండెల మీద తన్నిండు. బీజేపీ ఎం చేసింది. ఏమైనా చక్కదనం ఉందా?
Also Read
అందుకే అబద్దాల బీజేపీ, జూటా మాటల బీజేపీ. బట్టే బాజ్ బీజేపీ అని. నేను ఊర్కె అనలేదు. రాజేందర్ ను పెంచి పెద్ద చేసింది కేసీఆర్ కాదా అన్నారు. 2004లో టికెట్ ఇచ్చిన నాడు ముద్దసాని దామోదర్ ముందు ఈయన ఎంతుంటే… ఈయన ముఖం తెలుసా? కేసీఆర్ ముఖం చూసి ఓటేసిండ్రు.. ఈయన ముఖం చూసి ఓటు వేసిండ్రా. అలాంటి కేసీఆర్ ను మోసం చేసి బీజేపీలో చేరిండ్రు. ఇప్పుడు మనల్ని మోసం చేయడా? అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?