వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన వంటిల్లే వైద్యశాల.. పూర్వకాలంలో వంటింటి ఔషధాలతోనే అనేక వ్యాధుల్ని నయం చేసేవారు. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ముఖ్యమయిందిగా చెబుతారు. వెల్లుల్లిని వంటలో రుచి కోసం వాడుతారు.. కానీ దానిలో అనేక ఔషధాలు పుష్కలంగా ఉన్నాయనేది మీకు తెలుసా. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది చాలామందికి తెలియదు. మీ శరీరంలో చేరే అనేక హానికారక క్రిములను వెల్లుల్లి పోగొడుతుంది. నిత్యం మీకు జలుబు, జ్వరం వస్తోందా? అయితే మీరు వెల్లుల్లిని ట్రై చేయండి.
ఫ్లూ, క్యాన్సర్ వంటి వ్యాధులను వెల్లుల్లి అరికడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల మన శరీరానికి అనేక ఉపయోగాలు కలుగుతాయి. తరచూ వేధించే అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోజూ లేవగానే ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అనేక అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీంతోపాటు మన శరీర బరువు కూడా తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. రక్తం మందంగా ఉన్నవారికి వెల్లుల్లి తినడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించి వచ్చు. తద్వారా గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య దూరమవుతుంది. వెల్లుల్లిలో ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీకు అనేక రకాల ప్రయోజనాలు లభించడంతోపాటు ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. వెల్లుల్లి రెబ్బల్ని వలిచి నూనెలో వేయించి తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
గొంతు సంబంధిత వ్యాధులు, చిన్న చిన్న పొక్కులు నిరోధించవచ్చు. వెల్లుల్లిలో విటమిన్ బి6, సి, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిని 8 వారాల పాటు తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుందని ఆయుర్వేదంలో వుంది. విదేశీ సైంటిస్టులు కూడా తమ పరిశోధనల్లో బరువు తగ్గించే గుణం వెల్లుల్కి వుందని తేల్చిచెప్పారు. వెల్లుల్లి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోవడం వల్ల బరువు తగ్గి, హాయిగా అనిపిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!