ఆకాశంలో శాటిలైట్స్ మనిషి కంటికి కనిపించవు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ శాటిలైట్స్ కారణంగానే ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో తెలసుకోగలుతున్నాం. ఈ శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇటీవలే ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ లింక్ శాటిలైట్స్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ స్టార్‌లింక్ శాటిలైట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఆకాశంలో అప్పుడప్పుడు డజనుకు పైగా ఉపగ్రహాలు ఒక లైన్‌లో రైలు బండిలా వెళ్తూ కనిపిస్తుంటాయి.
Read: ఆ దేశాల్లో ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం… కాల్చితే…
అలాంటి వాటిని చూసి చాలా మంది కంగారుపడుతుంటారు. వీటిని కోంగాలైన్ అంటారు. ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంలో ఈ స్టార్‌లింక్ శాటిలైట్ ను ప్రవేశపెట్టారు. ఈ శాటిలైట్స్ ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. 2021 వరకు భూమిపైన సుమారు 1500 లకు పైగా స్టార్‌లింక్ శాటిలైట్లు ఉన్నప్పటికీ అందులో సగానికిపైగా ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లు ఉండటం విశేషం.