దీపావళి వచ్చింది అంటే మనదేశంలో చిన్నా పెద్దా అందరూ కలిసి దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తుంటారు. దీపావళి వేడుకలకు రెండు మూడు రోజుల ముందునుంచే సందడి మొదలౌతుంది. గతంలో చైనా నుంచి టపాసులు దిగుమతి చేసుకునేవారు. కానీ, ఇప్పుడు ఇండియాలో గ్రీన్ టపాసుల అమ్మకాలు పెరిగాయి. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరకం గ్రీన్ టపాసులను అమ్ముతున్నారు. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో బాణసంచా కాల్చడంపై నిషేదం అమలులో ఉన్నది. ఆ దేశాలు ఏంటో తెలసుకుందాం. నేపాల్ దేశంలో హిందూ సంప్రదాయాలను పాటిస్తుంటారు. నేపాల్ ను హిందూ దేశంగా పిలుస్తారు. అయితే, ఈ హిందూ దేశం నేపాల్‌లో బాణసంచా కాల్చడం నిషేదం.
Read: నవంబర్ 4, గురువారం దినఫలాలు…
చిన్న బాణసంచా కాల్చినట్టు తెలిసినా వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేపాల్‌తో పాటుగా పాకిస్తాన్‌లో కూడా ఫైర్ క్రాకర్స్‌పై నిషేదం ఉన్నది. ఇక సింగపూర్ లో కూడా బాణసంచాపై నిషేదం ఉన్నది. 1970లో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని సింగపూర్‌లో బాణసంచాపై నిషేదం విధించారు. బ్రిటన్‌లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రోడ్లపై బాణసంచా కాల్చకూడదు. చైనాలోనూ 1990 నుంచి అనేక నగరాల్లో బాణసంచా కాల్చడంపై నిషేదం ఉన్నది. అనుమతి ఉన్న కొన్ని నగరాల్లో మాత్రమే బాణసంచా కాల్చాలి. ఆస్ట్రేలియాలోనూ బాణసంచాపై నిషేదం ఉన్నది. సిడ్నీలో కొన్ని సంస్థలకు మాత్రమే బాణసంచా కాల్చే అనుమతులు ఉన్నాయి. ఎవరైనా సరే క్రాకర్స్ కాల్చాలి అంటే తప్పని సరిగా అనుమతులు తీసుకోవాలి.