కరోనా సమయంలో ప్రపంచంలో సింహభాగం ప్రజలు ఇంటివద్ధనే ఉండిపోయారు. కరోనా నుంచి కోలుకున్నాక ఫ్యామిలీ కోర్టుల్లో కేసులు పెరిగిపోయాయి. విడిపోయే జంటలు పెరిగాయి. కరోనా మహమ్మారి ఇటలీని ఎంతగా కుదిపేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. చైనా తరువాత కేసులు నమోదైంది ఇటలీలోనే. ఇటలీలో పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్న సమయంలో జైల్లో వివిధ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నవారిని ఇంటికి పంపేశారు. ఇళ్లలోనే జైలు జీవితం గడిపేలా ఏర్పాట్లు చేశారు.
అయితే, గైడోనియా మౌంటేసిలియోలోకి చెందిన వ్యక్తి నివశిస్తున్నాడు. అతను డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో కరోనా దేశంలోకి ప్రవేశించింది. మిగతా ఖైదీలతో పాటు అతడికి కూడా ఇంటి నుంచే జైలు శిక్షను అనుభవించేలా ఏర్పాట్లు చేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నది. ఆ తరువాత అతనికి టార్చర్ మొదలైందట. తన భార్య ప్రతిరోజూ టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. దీంతో ఆ ఖైది విసిగి వేసారిపోయాడు. ఇక ఇంట్లో ఉండలేక భార్య నుంచి ఎలాగోలా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. తనను భార్య నుంచి కాపాడాలని, తాను ఇంట్లో ఉండలేనని, ఇంటి కంటే జైలు జీవితమే బెటర్ అని, ఎన్నేళ్లు జైలు శిక్ష విధించినా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని పోలీసులకు చెప్పాడు. గృహనిర్భంధ నియమాలను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని జైలుకు తరలించారు. జైలుకు తరలించడంతో స్వాతంత్య్రం వచ్చినంత ఆనందపడిపోయాడు సదరు వ్యక్తి.
Read: ఇతని ముందు రోబోలు కూడా దిగదుడుపే…