టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి పనీ చాలా సులభం అయింది. ఇడ్లీ, దోశలు, చపాతి వంటి బ్రేక్‌ఫాస్ట్‌లు తయారు చేయడానికి కూడా మెషీన్‌లను వినియోగిస్తున్నారు. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, చేయి తిరిగిన వంటవాళ్ల ముందు అవన్నీ దిగదుడుపే కదా. ఏది ఎలా వండితే బాగుంటుందో ఒక వంట మనిషికి తెలిసినట్టుగా మెషీన్‌లకు ఎలా తెలుస్తుంది చెప్పండి. పెద్ద పెద్ద హోటల్స్‌లో మెషీన్‌లను వినియోగించినా అక్కడి వంటల టేస్ట్ పెద్దగా ఉండదు. కానీ, స్ట్రీట్ ఫుడ్‌లో ఉండే రుచి వేరుగా ఉంటుంది. కాస్త ఫేమస్ అయితే చాలు. జనాలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దోశలు వేయడంలో ఆరితేరిన ఓ వ్యక్తి పెనం మీద రోబోలు, మెషిన్‌ల కంటే వేగంగా దోశలు వేసి వాటిని కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు. ఎంత స్పీడ్‌గా దోశలు వేస్తున్నప్పటికీ రుచిలో ఏ మాత్రం తేడా లేకుండా చూసుకోవడం విశేషం. దీంతో ఈ స్ట్రీట్ హోటల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజ వ్యాపారులు ఆ వంటమనిషి నైపుణ్యానికి ఫిదా అయ్యాడు.
Read: ఇలాంటి రన్‌వే మీరెక్కడా చూసుండరూ…