కరోనా కాలంలో వన్యప్రాణులు రోడ్లమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. వన్యప్రాణుల నుంచి వన్యమృగాల వరకు రోడ్లమీదకు వచ్చి సందడి చేశాయి. కాగా, ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఉండే ఆస్ట్రిచ్ పక్షులు సడెన్‌గా పాక్‌లోని లాహోర్ రోడ్లపై పరుగులు తీస్తూ కనిపించాయి. ఆస్ట్రిచ్ పక్షులు రోడ్డు మీదకు రావడంతో జనాలు సైతం వాటితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆస్ట్రిచ్ పక్షులను పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో ఒకటి గాయపడి మృతి చెందింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆస్ట్రిచ్ పక్షి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read: ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న ఫొటో…