కొన్ని చెట్ల ఆకులు ముట్టుకుంటే ముడుచుకుపోతాయి. కొన్ని తీగలు మెలితిరిగిపోతాయి. అయితే, ఈ చెట్టు అన్నింటికంటే ప్రత్యేకం. ఈ చెట్టు కాండాన్ని పట్టుకుంటే చాలు.. పైనున్న కొమ్మలు ఊగిపోతాయి. దూరం నుంచి ఆ చెట్టును చూసినా దానిలో ప్రతిస్పందనలు కలుగుతాయట. ఈ చెట్టు పేరు రండియా డ్యుమెటోరమ్. వేళ్ల నుంచి కొమ్మల చివరి వరకు చాలా సున్నితమైన సెన్సార్ల వంటి భాగాలు ఇందులో ఉంటాయట. ఉత్తర ప్రదేశ్‌లోని దుద్వా జాతీయ పార్క్‌లోని కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్ఛురీలో ఈ రండియా డ్యుమెటోరమ్ చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్టు మొదలు లావుగా ఉంటుంది. ఊదా రంగులో ఉండే ఈ చెట్లు చాలా అరుదుగా ఉంటాయని, ఇవి అన్ని చోట్లా పెరగవని, కేవలం గడ్డి మైదానాల ప్రాంతాల్లోనే పెరుగుతాయని కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అధికారులు చెబుతున్నారు.
Read: తైవాన్‌కు చైనా ముప్పు… ఆ బాధ్యత ప్రపంచానిదే…