పెళ్లి వేడుకలకు వందలాది మంది అతిథులు తరలివస్తుంటారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తుంటారు. మెక్సికోలోని న్యూవో లియోన్ పర్వత ప్రాంతంలో ఇటీవలే ఓ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన అతిథుల కోసం రిసెప్షన్ హాలులో భోజనం ఏర్పాట్లు చేశారు. అందరూ భోజనాలు చేస్తుండగా అనుకోని అతిథి అక్కడికి వచ్చింది. దాన్ని చూసి జనాలు హడలిపోయారు. అయితే, వారిని ఏమి చేయని ఆ అతిథి ఎలుగుబంటి అక్కడ ఉన్న ఆహారపదార్థాలను వాసన చూసి కావాల్సిన ఆహారాన్ని తీసుకొని వెళ్లిపోయింది. అయితే, ఆ ఎలుగుబంటి ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు. దీనికి సంబందించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read: వింత ఆలోచన: ఐస్‌క్రీమ్ ప్లేవర్లకు సమాధులు…