ఇప్పుడంటే ఎన్నో ఛానళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ 24 గంటలపాటు ప్రసారాలు ప్రసారమౌతూనే ఉన్నాయి. మనదేశంలో తొలిసారిగా టీవీ ప్రసారాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో తెలుసా.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మనకు స్వాతంత్య్రం రాకముందు నుంచే రేడియో ప్రసారాలు అందుబాటులో ఉండేవి. రేడియో ద్వారానే చాలా వరకు విషయాలు తెసుకునేవారు. 1959 నుంచి దేశంలో టీవీ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో టీవీ మాధ్యమం రేడియోతో కలిసి ఉండేది. 1965 వ సంవత్సరంలో దూరదర్శన్‌ను ఏర్పాటు చేశారు. దూరదర్శన్ ఏర్పాటు తరువాత ప్రతిరోజూ రెండు గంటలపాటు ప్రసారాలు ప్రసారం అయ్యాయి. ఆ తరువాత రామాయణం, మహాభారతం వంటివి ప్రసారం కావడంతో దూరదర్శన్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్ని భాషల్లో ప్రస్తుతం దూరదర్శన్ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.
Read: టెస్లా జోష్… మస్క్ మరో రికార్డ్…