దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ప్రతిరోజు పెరుగుతున్న వేళ ఉపశమనం కలిగించింది కేంద్రం. దీపావళి వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడంతో ధరలు దిగివచ్చాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచి అమలులోకి […]
దీపావళి సందర్భంగా ఉత్తరాధికి చెందిన వ్యక్తులు లక్ష్మీ పూజను నిర్వహిస్తుంటారు. దీపావళికి ముందురోజు ఈ పూజను నిర్వహిస్తారు. పూజగదిలో డబ్బును ఉంచి పూజిస్తారు. ఇలానే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివశించే ప్రకాశ్ చంద్ జైన్ అనే వ్యక్తి తన ఇంట్లో లక్ష్మీపూజను నిర్వహించారు. పూజ నిర్వహించేసమయంలో గదిలో మూడున్నర లక్షల డబ్బును ఉంచారు. ఇంటికి వచ్చిన అతిధుల కోసం క్యాటరింగ్ ఆర్డర్ చేశాడు. అతిథులు భోజనాలు చేసిన తరువాత వారిని పంపించేందుకు యజమాని జైన్ బయటకు రాగానే, కేటరింగ్ […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఆహారం లేక లక్షలాది మంది ప్రజలు అలమటిస్తున్నారు. మానవతా దృక్పధంలో కొన్ని దేశాలు ఆహారం వంటివి సరఫరా చేస్తున్నా, అవి కొంత వరకు మాత్రమే సరిపోతున్నాయి. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఏ ప్రపంచ దేశం కూడా అధికారికంగా గుర్తించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చాలదన్నట్టుగా తాలిబన్లు అక్కడి ప్రజలపై కఠినమైన చట్టాలు అమలు చేస్తూ మరిన్ని బాధలు పెడుతున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఫ్రీజ్ […]
తులం బంగారం కొనుగోలు చేయాలంటే బోలెడు డబ్బులు పోయాలి. బంగారం ఆభరణాల రూపంలోనే కాదు, తినే వస్తువులుగా కూడా మార్చుకోవచ్చు. వీటిని ఇడబుల్ గోల్డ్ అని పిలుస్తారు. 24 క్యారెట్ల ఇడబుల్ గోల్డ్‌ను పేపర్లా మార్చి తినేందుకు వినియోగిస్తుంటారు. ఈ ఇడబుల్ గోల్డ్ తో ఐస్‌క్రీమ్‌ను కూడా తయారు చేయవచ్చట. ఈ 24 క్యారెట్ల ఐస్‌క్రీమ్ కావాలి అంటే హాంకాంగ్ వరకు వెళ్లాల్సిందే. ఐస్‌క్రీమ్ పైన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పలుచని పేపర్ ను […]
ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్ధలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ గతంలో ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని ఎయిడెడ్ విద్యాసంస్ధల అభిప్రాయాలతో సంబంధం లేకుండా విలీనం చేసేందుకు విద్యాశాఖాధికారులకు రంగంలోకి దిగారు. ఆ ఆదేశాలతో విద్యాశాఖాధికారులు తమ ప్రతాపం చూపడం మొదలెట్టారు. పురాతనమయిన, ఎంతో చరిత్ర కలిగిన విద్యాసంస్థల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు […]
ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం మన చేతుల్లోనే వుంది. మన వంటిల్లే మంచి వైద్యశాల. ఏ ఆరోగ్య ఇబ్బంది అయినా మన వంటింట్లో దొరికే దినుసులతో నయం చేసుకోవచ్చు. వంటింట్లో మనం నిత్యం వాడేది ఎక్కువగా పసుపునే. పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో వాడితే మీకు తెలియదు. మనం పాలు మామూలుగా తాగేకంటే అందులో కొద్దిగా పసుపు కలిపి మనం పసుపు పాలు తీసుకోవడం మంచిది. […]
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. సలాక్ పూర్ గ్రామంలో ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు ఎనిమిది మంది హైదరాబాద్ స్నేహితులు. రాత్రి విందు చేసుకొనే క్రమంలో షికారుకు వెళ్ళారు. ఆసమయంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో మిషాక్ అనే యువకుడి తలకు బలంగా తగిలింది. దీంతో గాయపడిన మిషాక్ ని […]
దీపావళి పండుగ వచ్చింది దేశంలోని అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. నరకాసుడిని వధించిన రోజు కావడంతో ఈ పండుగకు దీపావళి అని పేరు వచ్చింది. దీపావళి విశిష్టత గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, దీపావళి అన్నది మనకు తెలిసి పండుగ పేరు. కానీ, ఆ గ్రామస్తులకు మాత్రం అది పండుగతో పాటుగా ఆ గ్రామం పేరు కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఓ గ్రామం ఉన్నది. ఆ గ్రామం పేరు […]
ఆకాశంలో శాటిలైట్స్ మనిషి కంటికి కనిపించవు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ శాటిలైట్స్ కారణంగానే ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో తెలసుకోగలుతున్నాం. ఈ శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇటీవలే ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ లింక్ శాటిలైట్స్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ స్టార్‌లింక్ శాటిలైట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఆకాశంలో అప్పుడప్పుడు డజనుకు పైగా ఉపగ్రహాలు […]
దీపావళి వచ్చింది అంటే మనదేశంలో చిన్నా పెద్దా అందరూ కలిసి దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తుంటారు. దీపావళి వేడుకలకు రెండు మూడు రోజుల ముందునుంచే సందడి మొదలౌతుంది. గతంలో చైనా నుంచి టపాసులు దిగుమతి చేసుకునేవారు. కానీ, ఇప్పుడు ఇండియాలో గ్రీన్ టపాసుల అమ్మకాలు పెరిగాయి. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరకం గ్రీన్ టపాసులను అమ్ముతున్నారు. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో బాణసంచా కాల్చడంపై నిషేదం అమలులో ఉన్నది. ఆ దేశాలు ఏంటో తెలసుకుందాం. నేపాల్ […]