దీపావళి పండుగ వచ్చింది దేశంలోని అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. నరకాసుడిని వధించిన రోజు కావడంతో ఈ పండుగకు దీపావళి అని పేరు వచ్చింది. దీపావళి విశిష్టత గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, దీపావళి అన్నది మనకు తెలిసి పండుగ పేరు. కానీ, ఆ గ్రామస్తులకు మాత్రం అది పండుగతో పాటుగా ఆ గ్రామం పేరు కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఓ గ్రామం ఉన్నది. ఆ గ్రామం పేరు దీపావళి. ఈ గ్రామానికి ఆ పేరు రావడం వెనుక కారణం ఉన్నది. గతంలో శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఎండవేడి ఎక్కువగా ఉండటంతో స్పుహతప్పి పడిపోయాడు. కూలిపనులు చేసుకునే వ్యక్తులు రాజుగారికి సేవలు చేశారు. స్పుహనుంచి కోలుకున్న రాజు ఆ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టారట.