కరోనా మహమ్మారి తరువాత దేశీయ విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటోంది. దేశీయ విమానాలు 100శాతం సీటింగ్‌తో ప్రయాణాలు సాగిస్తున్నాయి. సురక్షితమైన ప్రయాణాలు సాగించేందుకు అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నా, నిబంధనలు అమలు చేస్తున్నారు. విమాన ప్రయాణికులను పెంచుకునే క్రమంలో కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది.
Read: ఆ గ్రామంలో దీపావళి ఎలా జరుపుకుంటారో తెలిస్తే షాక్ అవుతారు…
ప్రయాణికులు కొనుగోలు చేసే టికెట్‌ను వాయిదాల రూపంలో చెల్లించే విధంగా స్పైస్ జెట్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఆ ఆఫర్ ప్రకారం, టికెట్ కొనుగోలు చేసే సమయంలో మొదటి వాయిదాను యూపీఐ ద్వారా చెల్లించాలి. ఆ తరువాత వాయిదాలు యూపీఐ ద్వారానే ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఆ ఈఎంఐ స్కీమ్‌ను వినియోగించుకోవడానికి డెబిట్ లేదా క్రెడిట్ కార్టులను అనుమతించబోమని స్పైస్ జెట్ స్పష్టం చేసింది.