హైదరాబాద్ లో ఒక వైపు గంజాయి, డ్రగ్స్ మరోవైపు నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్ల నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద ఉన్న బ్యాగులో 500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ ఐ దాస్, లక్ష్మీ నారాయణలతో కలిసి పట్టుకున్నారు గోల్కొండ ఇన్ స్పెక్టర్ సముద్ర శేఖర్. 7 టూంబ్స్ బస్ […]
భారీ వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఏపీకి వాయుగండం తప్పేలా లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం 11న తమిళనాడు తీరానికి చేరనుంది. 4 రోజులు దక్షిణ కోస్తాలో భారీవర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం వుండనుంది. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా మారనుంది. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ […]
ఏపీలో రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి. మంగళవారం ఏపీలోని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ నేతలు ధర్నాలకు పిలుపునిచ్చారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ ధర్నాలపై హాట్ కామెంట్స్ చేశారు. పెట్రోల్ డీజిల్ రేట్లు అంశంలో చంద్రబాబు ధర్నా ఏపీ లో కాదు…జంతర్ మంతర్ దగ్గర చేయాలన్నారు. దమ్ముంటే బీజేపీ పై ధర్నా చేయాలన్నారు కారుమూరి. తన స్వంత నియోజకవర్గం కుప్పం […]
గంజాయి గుప్పుమంటోంది. అక్రమార్కులు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రయివేట్ ట్రావెల్స్ బస్ లో గంజాయిని పట్టుకున్నారు శ్రీకాకుళం పోలీసులు. శ్రీకాకుళం జాతీయ రహదారిపై మూడు గంటల పాటు చీకట్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ చెందిన ప్రైవేటు ట్రావెల్స్ లో సుమారు 30 కిలోల గంజాయితో ఎస్.ఈ.బి పోలీసులు పట్టుకున్నారు. బస్సు 35 మంది ప్రయాణికులుతో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతోంది. అటు […]
అనంతపురం జిల్లా వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. తోలుబొమ్మల తయారీలో ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా నిమ్మలకుంట గ్రామం సోమవారం ఆనందంతో పులకించిపోయింది. తన ఒడిలో దశాబ్దాలుగా తోలుబొమ్మలు తయారు చేస్తూ గ్రామం పేరును దశదిశలా వ్యాపింపజేసిన కళామతల్లి ముద్దుబిడ్డ దళవాయి చలపతిరావుకు విశిష్ఠ పురస్కారం దక్కినందుకు పరవశించింది. సుప్రసిద్ధ కళాకారుడు దళవాయి చలపతిరావు సోమవారం ఢిల్లీలో ఉన్నత పురస్కారమైన పద్మశ్రీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు సంతోషంలో మునిగిపోయారు. […]
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జిల్లాలోని రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న నిర్వహించనున్న పోలింగ్ సమయాన్ని కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మారేడుమిల్లి మండలం దొరచింతవానిపాలెం, వీఆర్ పురం మండలం చినమట్టపల్లి ఎంటీటీసీ స్థానాలు, ఎటపాక మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని ఎస్ఈసీ తెలిపింది. అధికారులు ఈ విషయాన్ని ఆయా మండలాల్లోని […]
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఫలక్‌నుమా పరిధిలో డ్యాన్సర్ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. యువతి మృతదేహం నగ్నంగా పడేశారు దుండగులు. డ్యాన్సర్ పై అత్యాచారం జరిగిందా? లేక గ్యాంగ్ రేప్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడేయడంతో దుండగులు ఆమెపై అత్యాచారం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువతి పోన్ కాల్ డేటా ఆధారంగా మృతిపై దర్యాప్తు జరుగుతోంది. మృతి చెందిన యువతిని […]
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న నమీబియాతో ఆడుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. అంతర్జాతీయT20 క్రికెట్లో 3వేలకు పైగా పరుగులను సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.రోహిత్ ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2సిక్స్‌లు) పరుగులు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 108 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత […]
కరోనా తరువాత దేశం ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. పేదవాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. తినేందుకు తిండి దొరక్క చిన్నారులు రోడ్డుపై భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నా వారి పరిస్థితులు మారడంలేదు. ఇక చాలా మంది అలాంటి వారికి కొంత డబ్బులు ఇచ్చి ఫొటోలు దిగుతుంటారు. దీనిని గమనించిన సునీల్ జోషి అనే ప్రైవేటు టీచర్ 50 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. […]
కోవిడ్ మహమ్మారి వల్ల 20 నెలల కిందట విధించిన అంతర్జాతీయ విమానయాన రాకపోకలకు విధించిన నిషేధాన్ని యూఎస్ఎ ప్రభు త్వం ఎత్తి వేసింది. దీంతో లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్, వర్జిన్ అట్లాంటిక్ ఒకటి సోమవారం లండన్‌లోని హీత్రూ విమానా శ్రయం నుంచి న్యూయార్క్‌లోని జాన్ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి ఈ ఫ్లైట్లు బయలు దేరి వెళ్లాయి. కోవిడ్-19కి వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేసిన విదేశీ సందర్శకులకు యునైటెడ్ స్టేట్స్ తన వాయు సరిహద్దులను […]