ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జులై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్ ఇవ్వలేదని పిటిషన్ వేసిన ఏపీ ఉద్యోగులు.. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 3లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అఫిడవిట్ వేయకపోతే ప్రతివాదులంతా కోర్టుకు రావాల్సి ఉంటుందన్న సుప్రీం చెప్పింది. డిసెంబర్ 8న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఆగస్టులో ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జరిగింది. దీనిపై […]
మనీలాండరింగ్ కేసులోఈ నెల 2న అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు షాకిచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ కోర్టును కోరారు. అయితే ఆయన కోరికను కోర్టు తోసి పుచ్చింది. “ముందుగా జైలు కూడు తినండి. ఒకవేళ తినలేకపోతే అప్పుడు మీ కోరికను పరిగణలోకి తీసుకుంటాం” అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా […]
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం జరిగిన పేలుడులో కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమ కాబూల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్ 5లో సోమవారం ఉదయం ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. ఈ పేలుడుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన దుకాణదారుడు అహ్మద్ ముర్తాజా వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, తాను కస్టమర్‌తో బిజీగా ఉన్నానని, “తన స్టోర్‌ను కదిలించిందని చెప్పాడు”. పేలుడు జరిగిన […]
వైసీపీలో అంతా తానై సజ్జలే నడిపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ .. సజ్జలపై సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల మరో సారి ప్రెస్‌మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వంలో పిల్లి ఈనినా.. కుక్క అరిచినా సజ్జలే సమాధానం చెబుతున్నా రన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ బెంగళూరులో ఉన్నప్పుడు ఆయ నతోనే కలిసి సజ్జలే ఉండేవారని ఆయన అన్నారు. ఒకే కంచం.. ఒకే […]
రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అధికారులకు కీలక సూచ నలు చేశారు. రాష్ర్టంలో రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేప ట్టాలని సూచించారు. రాష్ట్రంలో రహదారుల పై ఉన్న గుంతలు తక్ష ణమే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం కోరారు. […]
మీ రాజకీయ పబ్బం గడువు కోవడం కోసం గిరిజనుల భుజాలపై తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం బీజేపీ నేతలు మానుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఇకనైనా రాష్ర్ట బీజేపీ నేతలు దివాల కోరు మాటలను మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధంగా గిరిజనులకు రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. సమ్మక్క- సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల నిధులు వెచ్చిస్తే.. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల […]
ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని పురందేశ్వరి అన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించినట్టు పురందేశ్వరి తెలిపారు.ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామని తెలిపింది. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని మిగిలిన అంశాలపై కూడా చర్చించామని […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బండి సంజయ్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీకి కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తామని ఎగొట్టిందని ఆయన అన్నారు.ఆ వెయ్యి కోట్లు కూడా తెలంగాణ అప్పు తీసుకుని గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. బండి సంజయ్ చెప్పినట్టు కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇవ్వ […]
ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే, […]
వైసీసీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయన్నారు. కుప్పం కోట తొలిసారి బద్ధలైంది అన్నారు. మా ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఓట్లు అడిగాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. ఐఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులంటే చంద్రబాబు […]