ఉత్తరాఖండ్‌ను యూపీ నుంచి విభజించి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత, రెండు రాష్ట్రాలు పరస్పరం దాఖలైన కేసులను ఉపసం హరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. చాలా కేసులు ఆస్తుల విభజనతో ముడిపడి ఉన్నాయి. “కొన్ని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో, సమస్యలను పరిష్కరించేందుకు ఇరువైపులా అధికారులు 15 రోజుల్లో సమావేశమవుతారు” అని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామనీ చెప్పారు. ఈ సందర్భంగా ధమానీ మాట్లాడుతూ.. నేను యుపితో భావోద్వేగ బంధాన్ని పంచుకున్నాను. నేను […]
విశాఖలో ఇద్దరూ మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశాఖ ఎస్పీ కృష్ణారావు ఎదుట మహిళా మావోయి స్టులు తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలు సరెండర్ అయ్యారు. వీరిరువూరు పలు ఘటనలలో, నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెద బయలు దళానికి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు అనేక నేరాల్లో పాల్గొన్నారని తెలిపారు. అనారోగ్య కారణాలతో పాటు ప్రజల నుంచి మావోయిస్టులకు ఆదరణ లభించకపోవడంతో లొంగిపోయారన్నారు. ఇద్దరు […]
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పై కేసుల ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ రావుపై పలు పోలీస్ స్టేషన్ లో చీటింగ్, ల్యాండ్ కబ్జాలు, ఫోర్జరీ, బెదిరింపులు మోసాలు పాల్పడ్డ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కమిషనరేట్ లో 16 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. 2012లో బంజారాహిల్స్ లో సంధ్య శ్రీధర్ రావు పై కేసు వుంది. 2016లో శ్రీధర్ రావు పై సీసీఎస్ లో కేసు నమోదయింది. 2017 లో సీసీఎస్‌లో ల్యాండ్ గ్రాబింగ్ […]
చిరుతపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహేగాం మండలం లోహ శివారులో పులి సంచారం గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. మూడు వాగుల వద్ద కార్తిక స్నానానికి వెళ్ళిన 20 మంది భక్తులు పరుగులు తీశారు. వారికి పులి ఎదురుపడింది, పులి కదలకపోవడంతో అక్కడే ఆగిపోయారు భక్తులు. పులి కనిపించిన సమాచారాన్ని ఊరిలో ఉన్నవారికి సమాచారం ఇవ్వడంతో వారంతా కదిలి వచ్చారు. గ్రామస్తులు డప్పులు వాయిస్తూ వెళ్ళడంతో పులిక పారిపోయింది. పులి కనిపించిన సమాచారాన్ని అటవీశాఖ […]
2021-25 కాలానికిగాను యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు జరిగిన ఎన్నికల్లో భారత్ 164 ఓట్లతో విజయం సాధించింది. దీంతో మరో నాలుగేండ్లపాటు యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) తీసుకునే నిర్ణయాలను పరిశీలిస్తుందని పారిస్‌లో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు రాజ్యాంగ విభాగాల్లో యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఒకటి. దీనిని సాధారణ సమావేశం ద్వారా ఎన్ను కుంటారు. సంస్థ పనితీరును, కార్యక్రమాలను, డైరెక్టర్ జనరల్ సమ ర్పించిన బడ్జెట్ […]
కోఠి డీఎంఏ కార్యాలయంలో రూ. 1.41 కోట్ల విలువైన నాలుగు అంబులెన్సు వాహనాలను ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఇలాంటి అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని ఆయన పేర్కొన్నారు. నాలుగు అంబులెన్సుల వాహనాల్లో లైఫ్ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఇవి బోధన్ ఆస్పత్రిలో ఈ వాహనాలను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం 108,104 ద్వారా అంబులెన్స్ సేవలను అందిస్తుందని తెలిపారు. వీటిలో పాడైపోయిన వాటి స్థానంలో […]
భారీవర్షానికి చిత్తూరు జిల్లా వణికిపోతోంది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం లో 79.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మధురానగరిలో వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది. ఈ భారీ వర్షానికి జంగాలపల్లి పాపిరెడ్డి పల్లి యు. ఎం పురం, పాతపాలెం జిఎంఆర్ పురం లో నీరు పొంగి పొరలడంతో వాగులు దాటలేక , పాఠశాల విద్యార్థులు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జంగాలపల్లె వాగు దాటలేక ఓ ఇంటి వద్ద ,ఓ ప్రైవేట్ […]
హక్కులను పొందడం కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నదే రామావతార సందేశం అన్నారు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కాని వంటిదన్నారు. శ్రీ కొమాండూర్ శశికిరణ్ రాసిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి కీలక ఉపన్యాసం చేశారు.మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని బోధించిన మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం మనందరికీ ఆదర్శ ప్రాయం. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతరం నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. శ్రీరాముడి జీవిత గాధ నుంచి […]
హైదరాబాద్ డ్రైనేజీల ముంపు సమస్యకు చక్కని పరిష్కారం చూపించాడో నెటిజన్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటి వ్యర్ధాలు నేరుగా కాలువల్లోకి కలిసి పోకుండా ఆయా కాలనీల నుంచి ప్రధాన కాలువల్లోకి వచ్చే చోట నెట్ లాంటిది తగిలించాల్సిన అవసరం వుంది. ఈ వ్యర్ధాలు అందులో వుండిపోతాయి. మురుగునీరు మాత్రం బయటకు పోతుంది. ప్లాస్టిక్ బాటిళ్ళు, చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లు అన్నీ ఈ నెట్లో వుండిపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో కాలుష్యం జరగకుండా వుంటుంది. అవి […]
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై వ్యూహాం పై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తు న్న పనులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టాలని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనిపై ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీయాలని […]