భారీవర్షానికి చిత్తూరు జిల్లా వణికిపోతోంది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం లో 79.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మధురానగరిలో వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది. ఈ భారీ వర్షానికి జంగాలపల్లి పాపిరెడ్డి పల్లి యు. ఎం పురం, పాతపాలెం జిఎంఆర్ పురం లో నీరు పొంగి పొరలడంతో వాగులు దాటలేక , పాఠశాల విద్యార్థులు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జంగాలపల్లె వాగు దాటలేక ఓ ఇంటి వద్ద ,ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులోనే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ప్రజలు. సుమారు 15 గ్రామాలకు పైగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.