విశాఖలో ఇద్దరూ మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశాఖ ఎస్పీ కృష్ణారావు ఎదుట మహిళా మావోయి స్టులు తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలు సరెండర్ అయ్యారు. వీరిరువూరు పలు ఘటనలలో, నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెద బయలు దళానికి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు అనేక నేరాల్లో పాల్గొన్నారని తెలిపారు. అనారోగ్య కారణాలతో పాటు ప్రజల నుంచి మావోయిస్టులకు ఆదరణ లభించకపోవడంతో లొంగిపోయారన్నారు.
ఇద్దరు మహిళా మావోలకు ప్రభుత్వ పరంగా వచ్చే చెరో లక్ష రూపాయలు రివార్డుతో పాటు ఇళ్ల స్థలం, వ్యవసాయభూమిని అందిస్తామని ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. పలు కీలక మావోయి స్టులు కార్యకలాపాల్లో పాల్గొన్న సీత, లచ్చి పలు ఎదురు కాల్పులు, ఇన్ఫార్మర్ నేపంతో హత్య ఘటనల్లో కీలకంగా ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ సూచించారు.