నిన్న ఉత్కంఠ భరితంగా జరిగిన INDvsNZ మ్యాచ్‌లో రోహిత్ ఒక తప్పు చేశాడని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌తో బౌలింగ్ చేయించకపోవడం కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పెద్ద తప్పు అని ఆకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రారంభంలోనే కివీస్ వికెట్ కోల్పోయి తడబడిన వేళ వెంకటేశ్‌తో రెండు, మూడు ఓవర్లు వేయించాల్సి ఉందన్నారు. దీపక్, సిరాజ్ ఓవర్లలో ఎక్కువ పరుగులు […]
మొండి బకాయిలను చెల్లించని వారి నుంచి బ్యాంకులు సొమ్మును రికవరీ చేశాయని, వీటి విలువ రూ. 5 లక్షల కోట్లకు పైగా ఉంటుం దన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “ఎవరైనా బ్యాంకు రుణాలు తీసుకుని పారి పోయినప్పుడు అందరూ చర్చించుకుం టారన్నారు. కానీ ధైర్యంగా ప్రభుత్వం వారి నుంచి తిరిగి తీసుకు వచ్చినప్పుడు, ఎవరూ దాని గురించి చర్చించరు” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. “మేము ఎన్‌పీఎల సమస్యను పరిష్కరించామన్నారు. బ్యాంకులకు […]
ఏపీని భారీవర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైకి ఆగ్నేయంగా 310కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయి వుంది. రేపు తమిళనాడు,దక్షిణ కోస్తా మధ్య తీరం దాటనున్న వాయుగుండం. కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ మెస్సేజ్ వార్నింగ్ జారీ చేసిన ఐఎండీ. రెండు జిల్లాలలో రేపటి వరకు భారీ వర్షాలు. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జలదిగ్బంధంలో కపిలతీర్దం. ఆలయంలోకి భక్తుల అనుమతి నిలిపివేసింది టీటీడీ. […]
ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ డియో గురువారం మీడియాతో మాట్లాడారు. పిల్లలకు COVID-19 టీకాలు వేయకపోతే రాష్ట్రంలోని పాఠశాలలు తెరవబడవు. పాఠశాలలు తమ సిబ్బందికి 100% కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా టీకాలు వేసేలా చూసుకోవాలని ఆయన తెలిపారు. “ఇది పాఠశాలలను తిరిగి తెరవడం గురించి కాద ని ఆరోగ్య సంరక్షణ కోసమని ఆయన చెప్పారు. ఇప్పటికే కోవిడ్ వల్ల చాలా నష్టపోయాం భవిష్యత్ తరాన్ని కాపాడాటానికి మా ముందు ఉన్న ఏకైక నిర్ణయం ఇదేనని […]
కేసీఆర్ అనాలోచితనిర్ణయం వల్ల రాష్ర్ట ఆర్థికస్థితి దిగజారిందని ఈట రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్‌పై విమర్శల బాణాలను సంధించారు. పైరవీలు చేసుకున్న వాళ్లకే బిల్లులు చెల్లిస్తున్నార న్నారు. రైతు రుణ మాఫీలో 24వేల కోట్లలో 5వేల కోట్లు కూడా చెల్లిం చలేదు. ఒకవేళ ఇచ్చినా డబ్బు కేవలం రైతుల వడ్డీ కట్టాడానికే సరి పోయింది. ఒక రైతుబంధు ఇచ్చి రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సీడీ, ఫసల్ […]
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలయింది. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు పిటిషనర్లు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని, వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్లు. పిల్ ను లంచ్ మోషన్ గా స్వీకరించాలని […]
వినయం, విధేయత, స్వామిభక్తి.. ఇవన్నీ వుంటే ఏదైనా సాధించవచ్చు. వడ్డించేవాడు మనవాడైతే ఫంక్తిలో ఎక్కడ కూర్చున్నా మన విస్తరిలోకి అన్నిరకాల రుచులు వచ్చిపడతాయని మరోసారి నిరూపణ అయింది. పెద్దల సభ అంటే కొందరికి మక్కువ. రాజకీయాల్లో జనంలో తిరగకుండా.. దండాలు పెట్టకుండా హాయిగా అయినవారి ఆశీస్సులు వుంటే హాయిగా పెద్దల సభలో దర్జాగా కాలు పెట్టేయవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసి రాజీనామా చేసిన పారుపాటి వెంకట్రామిరెడ్డి గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పదవికి […]
భారీవర్షాలు, వరదలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. జిల్లాకు ఇవాళ,రేపు భారీవర్ష సూచన ఉందన్నారు కలెక్టర్ హరినారాయణ. ఈ ఏడాది జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, ఇప్పటికే చెరువులు,డ్యాంలు పూర్తిగా నిండాయన్నారు. నదులు, వాగులు,నీటి ప్రవాహాలను దాటవదని, రేపు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా వుంచామని కలెక్టర్ హరి నారాయణ తెలిపారు.మరోవైపు తిరుపతి వెస్ట్ చర్చి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది నీటి ప్రవాహం. దీంతో వాహనాల అనుమతిని నిలిపివేశారు అధికారులు. […]
కేసీఆర్ చేస్తున్న ధర్నాపై కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ .. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను రాష్ర్ట, కేంద్రప్రభుత్వాలు కొనకుంటే ఎవ్వరూ కొంటారని ఆయన ప్రశ్నించారు. చైనా, శ్రీలంక, బర్మా, పాకిస్తాన్ దేశాలు కొంటాయ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీకు పాలన చేతకాకుంటే వదిలేయ్ అని భట్టీ అన్నారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామంటే […]
గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావుపై ఉచ్చుబిగుస్తోందా? ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు సంధ్య శ్రీధరరావు బాధితులు. ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లో 16 పైగా కేసు నమోదయ్యాయి.నార్సింగి,రాయదుర్గం, గచ్చిబౌలి ,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ,మియాపూర్ లో శ్రీధరరావు పై కేసులు నమోదయ్యాయి. తాజాగా రాయదుర్గం భవన వ్యవహారం సంబంధించి చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో చైతన్య రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు. పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చైతన్య. రాయదుర్గం ఏరియా లో […]