చిరుతపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహేగాం మండలం లోహ శివారులో పులి సంచారం గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. మూడు వాగుల వద్ద కార్తిక స్నానానికి వెళ్ళిన 20 మంది భక్తులు పరుగులు తీశారు. వారికి పులి ఎదురుపడింది, పులి కదలకపోవడంతో అక్కడే ఆగిపోయారు భక్తులు.
పులి కనిపించిన సమాచారాన్ని ఊరిలో ఉన్నవారికి సమాచారం ఇవ్వడంతో వారంతా కదిలి వచ్చారు. గ్రామస్తులు డప్పులు వాయిస్తూ వెళ్ళడంతో పులిక పారిపోయింది. పులి కనిపించిన సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు స్థానికులు. ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు భక్తులు. మరోవైపు వారం క్రితం ములుగు జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. కొద్దిరోజులుగా రోజులుగా మంగపేట మండలం మొట్లగూడెం, నర్సింహాసాగర్ అడవుల్లో పులి సంచారిస్తోంది. ఐదు రోజుల క్రితం స్థానిక రైతులకు చెందిన ఆవుల మందపై పులి దాడి చేసింది. పులి పంచారాన్ని అధికారులు ధృవీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.