ఒకవైపు నిత్యావసరాలు, మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే టెలికాం కంపెనీలు మాత్రం బాదుడు మానలేదు. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ 20 శాతం టారిఫ్ పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరల్ని భారీగా పెంచింది. పెరిగిన ధరలు ఈ వారంలోనే అమల్లోకి రానున్నాయి. ప్లాన్ల ధరల్ని 20 నుంచి 25 శాతం వరకు పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. 2019 డిసెంబర్లో ఓసారి టారిఫ్‌ను […]
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. హిందూపురం కొట్నూరు చెరువు మరువ వద్ద తృటిలో తప్పింది పెను ప్రమాదం.నీటిలో చిక్కుకుపోయింది తూముకుంట గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు. నీటి ప్రవాహం భారీగా ఉన్నా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు డ్రైవర్. బస్సులో దాదాపు 30 మంది మహిళలు వున్నారు. స్థానికుల సహాయంతో బయటపడ్డారు కార్మికులు. భారీ నీటి ప్రవాహం వున్నప్పుడు బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో మహిళా […]
మేషం :- ముఖ్యులతో కలిసి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కుటుంబీకుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల మాటపడక తప్పదు. స్థిర, చరాస్తుల విషయంలో తొందరపాటు తనం మంచిది కాదని గ్రహించండి. వృషభం :- ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పాతమిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ […]
కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్ద పులి కనిపించింది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. వాహనాలు నిలిపివేసి ఫోటోలు, వీడియోలు తీసిన ప్రయాణికులు. ఎన్టీవీ చేతిలో వీడియోలు వున్నాయి. పెద్ద పులి ఎటు నుంచి ఎటు వెళ్ళిందోనని టెన్షన్ పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
చిత్తూరు జిల్లాలో రాయల చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రాయలచెరువు వ్యవహారంపై అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు చెరువు ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇపుడు చర్చనీయాంశమవుతోంది. ఆరు రోజుల కిందట చెరువు నిండినప్పుడే స్పందించి వుంటే వేలాదిమంది ఇళ్ళు వదలి వెళ్ళే పరిస్థితి వుండేది కాదంటున్నారు. రాయలచెరువు […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 22 రోజులుగా చేస్తున్న మహా పాదయాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించిన తర్వాత రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు షా హితబోధ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఏపీ […]
ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్ […]
బంగారం స్మగ్లర్ల పాలిట వరంగా మారుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే టార్గెట్ గా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అయితే, కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగడం లేదు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ బంగారం సీజ్ చేశారు. కొలంబో ప్రయాణీకుల వద్ద 1.53 కోట్ల రూపాయల విలువ చేసే 3.1 కేజీల బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చారు. ఆ పేస్టును […]
పిద్దిపేట పట్టణంలో ఆదివారం అర్థరాత్రి హై డ్రామా నడిచింది. పట్టణంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులులాల్ కమాన్ పైన కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ, అది అక్కడ నుండి తొలగించాలంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విగ్రహాన్ని తొలగించారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని […]